
కోలీవుడ్ హీరో ధనుష్ తమ కుమారుడు అంటూ తన కొడుకుగా వ్యక్తి కతిరేశన్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న అతడిని మధురై ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి అతడు మరణించినట్లు సమాచారం. కతిరేశన్ వయసు ప్రస్తుతం72 ఏళ్లు ఉంటాయని కుటుంబసభ్యులు తెలిపారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న కతిరేశన్ను మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవికరించారు. కతిరేశన్ తరపు న్యాయవాది టైటస్ మాట్లాడుతూ, ఆయన చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నారని చెప్పారు.
మదురై జిల్లా మేలూరుకు చెందిన కతిరేశన్ (72) అతని భార్య మీనాక్షి తమిళ్ హీరో ధనుష్ తమ కుమారుడు అంటూ 2015 మదురై హైకోర్టు బ్రాంచ్‌లో కేసు వేశారు. అప్పట్లో దక్షిణాది చిత్రపరిశ్రమలో ఈ కేసు పెద్ద సంచలనం సృష్టించింది. తమ కుమారుడు పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే సినిమాలపై ఆసక్తితో ఇంటి నుంచి పారిపోయాడని అన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ కస్తూరి రాజా ఇంటికి చేరి వారికి దత్తపుత్రుడు అయ్యాడని కోర్టులో తెలిపారు. ప్రస్తుతం తమ వయసు పైబడినందున వారికి తమ కొడుకు ధనుష్ నెల నెల భరణం చెల్లించేలా ఆదేశించాలని ఆ దంపతులు మేళ్లూరు కోర్టును కోరారు. దాదాపు పదేళ్లుగా ఈ కేసుపై విచారణం జరిగింది.
ధనుష్ నకిలీ విద్యార్హత, బర్త్ డే సర్టిఫికేట్స్ సమర్పించాలని క్రిమినల్ యాక్షన్ ఆఫీస్ కతిరేశన్ మధురై ఆరో మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయగా.. సరైన ఆధారాలు లేవంటూ ఆ పిటిషన్ కొట్టివేసింది. దీనిని వ్యతిరేకిస్తూ కతిరేశన్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ధనుష్ దాఖలు చేసిన బర్త్ డే సర్టిఫికేట్ ప్రామాణికత నిర్ణయాన్ని కోర్టుకు పంపలేదని.. దానిని కొట్టివేసిన మేజిస్ట్రేట్ ఉత్తర్వులను రద్దు చేసి.. మళ్లీ విచారణ జరిపించాలని కోరారు. అయితే కతిరేశన్ దంపతులు సమర్పించిన జనన ధృవీకరణ పత్రాల్లో నమోదు చేసిన పుట్టుమచ్చలు ధనుష్ కు లేకపోవడంతో.. ఈ కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ధనుష్ కతిరేశన్-మీనాక్షి దంపతుల కుమారుడని ఆ ప్రాంతంలో అందరికీ తెలుసని, అయితే ఇప్పటి వరకు ధనుష్ నిజం ఒప్పుకోలేదని కతిరేశన్ తరుపు న్యాయవాది అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.