Premi Vishwanath: నేను మా ఆయన అందుకే కలిసి ఉండము.. కార్తీక దీపం ఫేమ్ వంటలక్క..

కార్తీక దీపం సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు వంటలక్క దీపగా సుపరిచితమైన నటి ప్రేమీ విశ్వనాథ్. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులను మరోసారి అలరిస్తుంది. తన వృత్తి, వ్యక్తిగత జీవితాల సమన్వయం గురించి ఇటీవల మాట్లాడారు. కేవలం నటన మాత్రమే కాకుండా న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలిగా, వ్యాపార రంగంలో, నిర్మాతగా కూడా ఆసక్తి చూపిస్తూ పలు బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

Premi Vishwanath: నేను మా ఆయన అందుకే కలిసి ఉండము.. కార్తీక దీపం ఫేమ్ వంటలక్క..
Premi Vishwanath

Updated on: Jan 20, 2026 | 1:12 PM

నటి ప్రేమీ విశ్వనాథ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే కానీ కార్తీక దీపం వంటలక్క అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా ఈ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ ద్వారా అలరిస్తుంది. తన కెరీర్ ప్రస్థానం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ప్రస్తుతం నటనపైనే పూర్తిగా దృష్టి సారించినట్లు ఆమె పేర్కొన్నారు. తాను మొదట్లో మోడల్‌ను గానీ, వృత్తిరీత్యా కళాకారిణిని గానీ కాదని స్పష్టం చేశారు. తన సోదరుడు ఒక ఫోటోగ్రాఫర్ అని, తనకు కూడా ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉందని వెల్లడించారు. తన సోదరుడు కొత్త కెమెరా కొన్నప్పుడు, మొదటిసారి తన ఫోటోలనే తీసి టెస్ట్ చేశారని ఆమె వివరించారు.

ఒకసారి తాను శారీలో ఉన్నప్పుడు తీసిన ఒక ఫోటో ద్వారా “కర్త ముత్తు” అనే చిత్రంలో అవకాశం లభించిందని, ఆ విధంగా అనుకోకుండా సినీ రంగంలోకి ప్రవేశించానని ప్రేమీ తెలిపారు. అక్కడి నుంచి ర్యాంప్ వాక్‌లు చేస్తూ, క్రమంగా తెలుగు చిత్ర పరిశ్రమ వరకు చేరుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. తన కెరీర్‌లో ఒక అవార్డు కోసం తమిళ్, మలయాళం, తెలుగు భాషల్లో ఒక టెలిఫిల్మ్‌లో నటించినట్లు వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తన భర్త వినీత్‌కు తమ బిజీ షెడ్యూల్స్ వల్ల సమయం కేటాయించలేకపోతున్నానని ఎప్పుడూ కోపం రాదా అని అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు.

తాను ఒక రాష్ట్రంలో ఉంటే, తన భర్త వినీత్ మరో రాష్ట్రంలో ఉంటారని, ఆయన తనకంటే బిజీగా ఉంటారని ప్రేమీ వివరించారు. తన భర్త తన పనుల్లో బిజీగా ఉన్నప్పుడు తాను ఇంట్లో కూర్చుని ఏం చేయాలని భావించి, తాను కూడా తన పనుల్లో నిమగ్నమై ఉంటానని తెలిపారు. ఇద్దరూ బిజీగా ఉండటం వల్ల సంతోషంగా ఉన్నామని, అప్పుడప్పుడు కలుస్తామని పేర్కొన్నారు. బిజీగా ఉండటమే తమ అన్యోన్య దాంపత్య రహస్యమని, దీనివల్ల గొడవపడటానికి సమయం ఉండదని ప్రేమీ విశ్వనాథ్ సరదాగా చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..