Tollywood: ఈ నడుము ఒంపుల వయ్యారిని గుర్తు పట్టారా..? బుల్లితెరపై చాలా ఫేమస్..

|

Apr 15, 2023 | 12:43 PM

సినిమాలలో హీరోయిన్స్‌ను పెద్దగా పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ.. సీరియల్స్‌లో ముఖ్య పాత్రలు వేసే నటీమణులను బాగా గుర్తుపెట్టుకుంటారు తెలుగు ప్రజలు. సాయంత్రం అయితే చాలు.. అలా టీవీలకు అతుక్కుపోతారు. ఫలానా సీరియల్‌లో అలా జరిగింది.. ఇలా జరిగింది అని తెల్లారి ముచ్చటించుకుంటారు. ఆ పాత్రలు వేసినవాళ్ల గురించి కూడా మాట్లాడుకుంటారు.

Tollywood: ఈ నడుము ఒంపుల వయ్యారిని గుర్తు పట్టారా..? బుల్లితెరపై చాలా ఫేమస్..
Amulya Gowda
Follow us on

‘కార్తీక దీపం’ సీరియల్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హై రేటింగ్స్‌తో బుల్లితెరను శాసించింది ఈ సీరియల్. ఇందులో పాత్రలను అయితే జనాలు ఓన్ చేసుకున్నారు. డాక్టర్ బాబు, వంటలక్కలతో పాటు… హిమ, శౌర్య క్యారెక్టర్లను తెలుగు జ,నాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా ఎప్పుడూ అల్లరి చేసే శౌర్య పాత్ర అందరికీ దగ్గరయ్యింది. చిన్నప్పటి శౌర్యకు ఏ రేంజ్ ఫ్యాన్ బేస్ ఉందో.. అలానే ఈ పెద్దప్పటి శౌర్య కూడా. ఆ పాత్రలో నటించింది కన్నడ ముద్దుగుమ్మ అమూల్య గౌడ్. ఈ సీరియల్‌తో తన క్రేజ్ ఎక్కడికో వెళ్లింది. కొద్ది కాలంలోనే ఎంత గుర్తింపును దక్కించుకుంది. తెలుగులో ఈ ఒక్క సీరియల్‌లోనే కనిపించింది ఈమె. ఆటో డ్రైవర్​గా మారిన శౌర్య పాత్రలో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.

కన్నడలో అమూల్య చాలా ఫేమస్. 2014లో ‘స్వాతి ముత్తు’ సీరియల్‌తో అక్కడ ఎంట్రీ ఇచ్చింది. ‘కమలి’తో మంచి క్రేజ్ సంపాదించుకుంది.  ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ ధారావాహికలతో బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ‘ఆరామనే’ లో నెగటీవ్ రోల్ చేసి.. అందర్నీ కట్టిపడేసింది. సోషల్​ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్​గా ఉండే ఈ బ్యూటీ తన లేటెస్ట్ పోస్ట్​లతో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తుంది. ఏమ్ అమ్మాయ్.. అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.