AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Suchitra: ధనుష్ గే అంటూ షాకింగ్ కామెంట్స్.. సింగర్ సుచిత్రకు లీగల్ నోటీసులు..

తన మాజీ భర్త కార్తీక్ గే అని.. ఆ విషయం తెలిసిన తర్వాత అతడి నుంచి విడాకులు తీసుకున్నానని తెలిపింది. అలాగే హీరో ధనుష్ గే అని.. మద్యం అధికంగా సేవించి హీరో ధనుష్, తన భర్త కార్తీక్ ఒకే గదిలో ఉండేవారంటూ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అలాగే అగ్రకథానాయికుడు కమల్ హాసన్ ఇచ్చే పార్టీల్లో విరివిగా డ్రగ్స్ వినియోగం ఉంటుందంటూ సంచలన కామెంట్స్ చేసింది.

Singer Suchitra: ధనుష్ గే అంటూ షాకింగ్ కామెంట్స్.. సింగర్ సుచిత్రకు లీగల్ నోటీసులు..
Suchitra
Rajitha Chanti
|

Updated on: May 19, 2024 | 6:31 PM

Share

ఒకప్పుడు సుచీ లీక్స్‏తో కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో తమిళ్ సినీ పరిశ్రమలోని స్టార్ నటీనటుల జీవితాల పై మచ్చ పడింది. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సింగర్ సుచిత్ర ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి కోలీవుడ్ తారలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తన మాజీ భర్త కార్తీక్ గే అని.. ఆ విషయం తెలిసిన తర్వాత అతడి నుంచి విడాకులు తీసుకున్నానని తెలిపింది. అలాగే హీరో ధనుష్ గే అని.. మద్యం అధికంగా సేవించి హీరో ధనుష్, తన భర్త కార్తీక్ ఒకే గదిలో ఉండేవారంటూ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అలాగే అగ్రకథానాయికుడు కమల్ హాసన్ ఇచ్చే పార్టీల్లో విరివిగా డ్రగ్స్ వినియోగం ఉంటుందంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇక సుచిత్ర చేసిన కామెంట్స్ మరోసారి ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ క్రమంలో సుచిత్రకు తన మాజీ భర్త కార్తీక్ షాకిచ్చాడు. ఆమెపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యాడు. తాజాగా సుచిత్రకు లీగల్ నోటీసులు పంపించాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పరువుకు భంగం వాటిల్లే విధంగా సుచిత్ర కామెంట్స్ చేసిందని.. అందుకు సంబంధించిన వీడియోస్ వెంటనే తొలగించాలని.. ఆపై అలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా చూడాలని లీగల్ టీమ్ ద్వారా డిమాండ్ చేశాడు కార్తీక్. సుచిత్రతోపాటు ఆమెను ఇంటర్వ్యూ చేసిన యూట్యూబ్ ఛానల్ కు కూడా కార్తీక్ నోటీసులు పంపించాడు. సదరు యూట్యూబ్ ఛానల్స్ విడుదల చేసిన వీడియోస్ పూర్తిగా తమ పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని.. వెంటనే ఆ ఛానెల్లను రద్దు చేయాలని నోటీసులలో పేర్కొన్నాడు.

అలాగే సుచిత్రను మరో రెండు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ్ చేశారని.. అందులో తన పరువుకు భంగం వాటిల్లే విధంగా సుచిత్ర చేసిన కామెంట్స్ వీడియోస్ తొలగించాలని డిమాండ్ చేశాడు. ధనుష్, కార్తీక్ తోపాటు.. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్, కమల్ హాసన్, త్రిష వంటి స్టార్స్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది సుచిత్ర.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే నష్టం
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే నష్టం
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆమె అవుట్
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆమె అవుట్
లవంగాల నైట్ క్రీమ్‌‌తో ముడతలు మాయం..ఇంట్లోనే తయారు చేసుకునే సహజ
లవంగాల నైట్ క్రీమ్‌‌తో ముడతలు మాయం..ఇంట్లోనే తయారు చేసుకునే సహజ
రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?