Karan Johar: సౌత్ ఇండియన్ సినిమాల పై షాకింగ్ కామెంట్స్ చేసిన కరణ్ జోహార్

బాలీవుడ్ లోనూ మన సినిమాలు డబ్ అయ్యి మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు భారీగా వసూళ్లను కూడా రాబడుతున్నాయి. సౌత్ ఇండియన్ సినిమాలకు నార్త్ ఇండియాలో విపరీతమైన డిమాండ్ ఉండటంతో కరణ్ జోహార్ సహా బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు 'సౌత్ ఇండియన్ సినిమాల వల్ల బాలీవుడ్ దారి తప్పుతోంది' అని కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Karan Johar: సౌత్ ఇండియన్ సినిమాల పై షాకింగ్ కామెంట్స్ చేసిన కరణ్ జోహార్
Karan Johar

Updated on: Oct 26, 2023 | 8:43 AM

సౌత్ ఇండియన్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది చాలా సౌత్ సినిమాలు పాన్ ఇండియా హిట్స్ గా నిలిచాయి. బాలీవుడ్ లోనూ మన సినిమాలు డబ్ అయ్యి మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు భారీగా వసూళ్లను కూడా రాబడుతున్నాయి. సౌత్ ఇండియన్ సినిమాలకు నార్త్ ఇండియాలో విపరీతమైన డిమాండ్ ఉండటంతో కరణ్ జోహార్ సహా బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ‘సౌత్ ఇండియన్ సినిమాల వల్ల బాలీవుడ్ దారి తప్పుతోంది’ అని కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్.. సౌత్ ఇండియన్ సినిమాల నుంచి బాలీవుడ్ ‘బ్యాడ్ హీరోయిజం’ని అప్పుగా తెచ్చుకుంది అని అన్నారు. ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడిన కరణ్ జోహార్.. “బ్యాడ్ హీరోయిజం” లేదా మితిమీరిన పురుషాధిక్యతతో సినిమాలు చేయడం బాలీవుడ్ స్టైల్ కాదు. మేము దానిని సౌత్ సినిమాల నుంచి తెచ్చుకున్నాం. ‘కేజీఎఫ్’, ‘పుష్ప’ తరహా సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత అదే టైప్ సినిమాలు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ బాలీవుడ్ వాటిని కాపీ కొడుతోంది.

బాలీవుడ్ రెడీమేడ్ సినిమాలకు పడిపోయిందని కరణ్ జోహార్ అన్నారు. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఉదాహరణగా చెబుతూ.. ‘మేం పురుషాధిక్యతను, హీరో మెయిన్ గా ఉండే కథలను సరైన రీతిలో చూపించేందుకు కష్టపడుతున్నాం. కానీ సౌత్ వాళ్ళు అందుకు తగిన విధంగా వ్యవహరిస్తున్నారు ‘అర్జున్‌రెడ్డి’. ‘కబీర్ సింగ్’ బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చింది కానీ అది మా స్టైల్ కాదు అని కరణ్ జోహార్ అన్నారు. కరణ్ జోహార్ చాలా సౌత్ సినిమాలను బాలీవుడ్ లో దబ్ చేసి నిర్మాతగా వ్యవహరించారు. బాహుబలి’కి హిందీ డిస్ట్రిబ్యూటర్ తోపాటు అనేక సౌత్ సినిమాలను  హిందీ డబ్‌ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి