Kantara: బాక్సాఫీస్ ప్రభంజనం కాంతార.. కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం..

కాంతార సినిమా ఎఫెక్ట్.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సంప్రదాయాల గురించి పట్టించుకోని ప్రభుత్వం.. 60 ఏళ్లు దాటిన భూత కోల నృత్యకారులకు ఫించిన్ అందించే నిర్ణయం తీసకుంది.

Kantara: బాక్సాఫీస్ ప్రభంజనం కాంతార.. కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం..
Kantara Movie

Updated on: Oct 21, 2022 | 6:44 PM

కాంతార.. ఇప్పుడు ఎక్కడా విన్నా ఈ సినిమా పేరే.. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోంది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్టవ్వడమే కాదు..! భారీగా కలెక్షన్లు రాబట్టడమే కాదు..! మేకర్స్ అందరి చేత చప్పట్లు కొట్టించుకోవడమే కాదు..! ఇప్పుడు ఏకంగా కన్నడ ప్రభుత్వాన్నే కదిలించింది. భూత కోల వారి కోసం ఆలోచించేలా చేస్తోంది. కనుమరుగవుతున్న కన్నడ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల పరిరక్ష కోసం ఓ అడుగు ముందుకేసేలా చేసింది. ఇంతకీ కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది అనే కదా మీ సందేహం.. అయితే అసలు విషయం తెలుసుకోవాల్సిందే.

భూత కోల నృత్యకారుల గురించి వారి సంస్కృతి సంప్రదాయాల గురించి నిన్న మొన్నటి వరకు పట్టించుకోని కన్నడ ప్రభుత్వం… తాజాగా కాంతార సినిమా ఎఫెక్ట్ తో వారి గురించి ఆలోచించడం మొదలెట్టింది. 60 ఏళ్లు దాటిన భూత కోల నృత్యకారులకు ఫించిన్ అందించే నిర్ణయం తీసకుంది. నెలకు 2 వేల రూపాయాలు వారి అకౌంట్లో పడేట్టు.. చర్యలు తీసుకుంటోంది. ఇక ఈ నిర్ణయంతో అందరి మనసులు గెలుచుకుంటోంది కన్నడ ప్రభుత్వం. హిందూ ధర్మంలో భాగంగా భూత కోల ఒక ప్రత్యేక దైవారాధనగా ఉంది. అలవెన్స్ ఇచ్చేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి.. మంత్రి సునీల్ కుమార్ కాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు పీసీ మోహన్.

ఇవి కూడా చదవండి

కన్నడలో ఇప్పటికే రికార్డ్ సృష్టించిన కాంతార ఇప్పుడు ఇతర భాషల్లోనూ సత్తా చాటుడుతుంది. ముఖ్యంగా ఈ సినిమా హిందీలో కలెక్షన్స్ వేగం పెంచింది. శుక్రవారం నాటికి ఈ సినిమా రూ. 1.27 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు మొత్తం రూ. 13.10 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించగా.. తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు.