Kantara: బాక్సాఫీస్ వద్ద కాంతార ప్రభంజనం.. ఏకంగా కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందిగా..

కేవలం కర్ణాటకలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో.. ఉత్తరాదిలో భారీగానే కలెక్షన్స్ రాబడుతుంది. మరోవైపు యూఎస్‏లోనూ సత్తా చాటుతోంది.

Kantara: బాక్సాఫీస్ వద్ద కాంతార ప్రభంజనం.. ఏకంగా కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందిగా..
Kantara Movie

Updated on: Oct 24, 2022 | 9:09 PM

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది కాంతార. కన్నడలో చిన్న సినిమాగా ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం కర్ణాటకలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో.. ఉత్తరాదిలో భారీగానే కలెక్షన్స్ రాబడుతుంది. మరోవైపు యూఎస్‏లోనూ సత్తా చాటుతోంది. హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఊహించని స్తాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇక దీపావళి కానుకగా విడుదలైన సినిమాలు కాంతార వసుళ్లకు అడ్డు నిలబడలేకపోయాయి. కొత్త సినిమాల తాకిడికి విపరీతమైన పోటిని ఇస్తుంది కాంతార. ఇప్పటివరకు ఈ మూవీ రూ. 167 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా తెలుస్తోంది.

తాజాగా కర్ణాటకలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. థియేటర్లలో అత్యధిక మంది చూసిన సినిమాగా కాంతార చరిత్ర సృష్టించింది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డ్స్ కాంతార బ్రేక్ చేసింది. కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించి హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ముందుగా కన్నడలో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో అన్ని భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

కర్ణాటకలో థియేటర్లలో అత్యథిక మంది చూసిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేయడంతో హీరో రిషబ్ శెట్టి ట్వట్టర్ వేదికగా తమ సంతోషాన్ని పంచుకున్నారు. విడుదలైన 25 రోజుల్లోనే కాంతార సినిమాకు దాదాపు 77 లక్షల మంది చూశారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డైరక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 చిత్రం 72 లక్షల మంది చూశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.