Kalki 2898 AD: కాంతార హీరో చేతుల్లో ప్రభాస్ బుజ్జి కారు.. రిషబ్ శెట్టి ఏమన్నారంటే..

|

Jun 25, 2024 | 6:48 AM

మూడు ప్రపంచాల మధ్య ఎలాంటి కథ ఉండనుందనే క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా.. ఈ మూవీలో బుజ్జికారు మరింత స్పెషల్ అట్రాక్షన్ కానుంది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది బుజ్జి కారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా గత కొన్ని రోజులుగా అన్ని నగరాల్లో తిరుగుతున్న బుజ్జి కారును ఇప్పటికే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర నడిపిన సంగతి తెలిసిందే.

Kalki 2898 AD: కాంతార హీరో చేతుల్లో ప్రభాస్ బుజ్జి కారు.. రిషబ్ శెట్టి ఏమన్నారంటే..
Rishab Shetty
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‏తో నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు. ఇందులో అమితాబ్ పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ,శోభన, మాళవిక నాయర్ వంటి స్టార్ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్స్ మూవీపై హైప్ క్రియేట్ చేయగా.. అసలు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పబోయే స్టోరీ ఏంటీ..? మూడు ప్రపంచాల మధ్య ఎలాంటి కథ ఉండనుందనే క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా.. ఈ మూవీలో బుజ్జికారు మరింత స్పెషల్ అట్రాక్షన్ కానుంది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది బుజ్జి కారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా గత కొన్ని రోజులుగా అన్ని నగరాల్లో తిరుగుతున్న బుజ్జి కారును ఇప్పటికే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర నడిపిన సంగతి తెలిసిందే.

తాజాగా బుజ్జికారును కాంతార హీరో రిషబ్ శెట్టి నడిపారు. బుజ్జి కారును డ్రైవ్ చేసి చిత్రబృందాన్ని, టెక్కికల్ సిబ్బందిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టిటం వైరలవుతుంది. బుజ్జికారును ప్రభాస్ తర్వాత అక్కినేని నాగచైతన్య కూడా నడిపిన సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్స్ కూడా బుజ్జి కారును నడిపారు.

భారీ అంచనాలు నెలకొన్న కల్కి ఈనెల 27న ప్రపంచవ్యా్ప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ప్రీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కల్కి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. మరోవైపు అమెరికా వంటి దేశాల్లో అధిక మొత్తం టికెట్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.