Puneeth Rajkumar: పునీత్ ఫోటో చూస్తూ దీనంగా పెంపుడు కుక్కలు.. వాటికెలా తెలిసేది ఇక ఆయన రాడని..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి రెండు వారాలు గడుస్తున్నా.. ఇప్పటికీ కర్ణాటక ప్రజలు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Puneeth Rajkumar: పునీత్ ఫోటో చూస్తూ దీనంగా పెంపుడు కుక్కలు.. వాటికెలా తెలిసేది ఇక ఆయన రాడని..
Puneeth

Updated on: Nov 09, 2021 | 9:56 AM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి రెండు వారాలు గడుస్తున్నా.. ఇప్పటికీ కర్ణాటక ప్రజలు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభిమాన హీరో అలా ఆకస్మాత్తుగా తమను వదిలి వెళ్లిపోవడంతో కన్నడ చిత్రపరిశ్రమలో శోకసంద్రంలో మునిగిపోయింది. అటు పునీత్ కుటుంబసభ్యులకు.. ఇటు కన్నడిగులకు ఈ చేదు వార్త ఇంకా మింగుడుపడడం లేదు. పునీత్ మరణంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. తమ అభిమాన హీరో జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పునీత్ ఫోటోలను.. వీడియోలను షేర్ చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఎంతో ఆరాధించే అభిమానులు.. ప్రేక్షకుల పరిస్థితే ఇలా ఉంటే.. రోజూ ప్రతి క్షణం పునీత్ వెన్నంటి ఉండే పెంపుడు కుక్కల పరిస్థితి మరీ దారుణం. తమను ఎంతో అమితంగా ప్రేమించే యాజమాని పట్ల పెంపుడు కుక్కలు చూపించే విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సాధారణంగా చాలా మంది కుక్కలను.. పిల్లులను తమ ఇంట్లో సభ్యులుగా భావిస్తుంటారు.. వాటిపై లెక్కలేనంత ప్రేమను చూపిస్తుంటారు. ఇక అవి కూడా తమ యాజమాని పట్ల ఎంతో ప్రేమను కురిపిస్తాయి. క్షణం తమ యాజమాని కనిపించకపోతే వారి కోసం ఆరాటపడిపోతుంటాయి. పునీత్ రాజ్ కుమార్‏కు సైతం కుక్క పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన చలా కుక్కలను పెంచుకున్నారు. గతంలో అనేకసార్లు.. తన పెంపుడు కుక్కలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు పునీత్.

Puneeth Rajkumar

అయితే తమతో ఎంతో ప్రేమగా ఉండే యాజమాని లేడని విషయం తెలియక ఆ కుక్క పిల్లలు కన్నీంటి పర్యంతమవుతున్నాయి. ఆయన ఫోటో ముందుకెళ్లి దీనంగా ఏడుస్తూ కుర్చుంటున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పునీత కనిపించకపోవడంతో అవి ఆహారం కూడా తీసుకోవడం లేదట. పునీత్.. ఇక రాలేడనే విషయం వాటికి ఎలా చెప్పాలో తెలియక.. చివరికి రాజ్ కుమార్ సమాధి వద్దకు ఆ కుక్కలను తీసుకెళ్లారు. పునీత్ పెంపుడు కుక్కల పరిస్థితి చూస్తే అక్కడున్న వారికి కన్నీళ్లు ఆగడం లేదు. పునీత్ పెంపుడు కుక్కల పరిస్థితి ఎప్పుడు మాములుగా పరిస్థితి వస్తుందో చూడాలి.

Also Read: Jai Bhim – Raghava Lawrence: మరోసారి దాతృత్వం చాటుకున్న లారెన్స్.. జై భీమ్ రియల్ ‘సినతల్లి’కి భారీ సాయం..

Adipurush: ఆదిపురుష్ కోసం తన పార్ట్ కంప్లీట్ చేసిన ఇంద్రజిత్.. ఎప్పటికీ మర్చిపోలేనంటూ..