Tollywood: మాకు కూడా జస్టిస్ హేమ లాంటి కమిటీ కావాలి.. సీఎంను కలిసి రిక్వెస్ట్ చేసిన నటీమణులు..

|

Sep 05, 2024 | 2:58 PM

తెలుగు, తమిళం, కన్నడ ఇండస్ట్రీలలోనూ మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికే పలువురు ఆర్టిస్టులు ఆరోపణలు చేశారు. కేరళ సినీరంగంలో ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిటీ తరహాలోనే తమకు కూడా ఓ కమిటీ ఉండాలని సుప్రీమ్ కోర్టు లేకా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆ కమిటీని ఏర్పాటు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్విటీ (ఫైర్).

Tollywood: మాకు కూడా జస్టిస్ హేమ లాంటి కమిటీ కావాలి.. సీఎంను కలిసి రిక్వెస్ట్ చేసిన నటీమణులు..
Sandalwood
Follow us on

జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక మలయాళీ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఎంతో మంది మహిళా ఆర్టిస్టులు సినీరంగంలో తమకు ఎదురైన పరిస్థితుల గురించి బయటపెడతున్నారు. కెరీర్ ప్రారంభంలో తమను కొందరు సీనియర్ నటులు వేధించారని.. లైంగిక దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికే కేరళ చిత్రపరిశ్రమలోని పలువురు నటులపై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఇదిలా ఉంటే.. కేవలం మలయాళంలోనే కాదు.. తెలుగు, తమిళం, కన్నడ ఇండస్ట్రీలలోనూ మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికే పలువురు ఆర్టిస్టులు ఆరోపణలు చేశారు. కేరళ సినీరంగంలో ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిటీ తరహాలోనే తమకు కూడా ఓ కమిటీ ఉండాలని సుప్రీమ్ కోర్టు లేకా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆ కమిటీని ఏర్పాటు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్విటీ (ఫైర్).

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నివేదించేందుకు, చిత్ర పరిశ్రమలో మహిళల భద్రతకు అవసరమైన విధానాలను రూపొందించేందుకు కేరళ తరహాలో కమిటీని వేయాలని కోరుతూ ఫైర్ (ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ) సంఘ్ రెండు రోజుల క్రితం సీఎంకు లేఖ రాసింది. ఈరోజు (సెప్టెంబర్ 05) కొందరు ఫైర్ సభ్యులు సీఎంను స్వయంగా కలిసి వినతి పత్రం ఇచ్చారు. నటుడు చేతన్ అహింస, నటి శృతి హరిహరన్, సంగీతా భట్, నీతూ శెట్టి తదితరులు ఇవాళ కావేరీ నివాసంలో సీఎం సిద్ధరామయ్యను కలిసి, సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు రిటైర్డ్ జడ్జిల నేతృత్వంలో కమిటీ వేయాలని కోరారు.

దర్శకుడు కె.ఎం.చైతన్య మాట్లాడుతూ.. ‘కన్నడ సినిమాకు కూడా అలాంటి కమిటీ అవసరం. ఎందుకంటే ఈ ఐదేళ్లలో జరిగిన దానికంటే లైంగిక హింస ఘటనలు జరగకూడదనేది దీని ఉద్దేశం. కేవలం లైంగిక వేధింపులే కాదు. పారితోషికంలో ఉన్న అసమానతలను కూడా తొలగించాలి. వీటన్నింటికీ స్పష్టమైన విధానం అవసరం’ అని అన్నారు. ఫైర్ ఆర్గనైజేషన్ డిమాండ్‌కు సినీ పరిశ్రమకు చెందిన పలువురు మద్దతు తెలిపారు. సీఎంకు ఇచ్చిన వినతిపత్రంపై ఇప్పటికే 150 మందికి పైగా సంతకాలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.