పొగరు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన కన్నడ స్టార్ హీరో ధ్రువ్ సర్జా. రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. యాక్షన్ ఓరియంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన ‘కేడీ-ది డెవిల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. భారీకాయంతో ఎప్పుడూ నిండుగా కనిపించే ధ్రువ్ ఈ సినిమా కోసం స్లిమ్‌గా మారిపోయాడు. ఏకంగా 18 కిలోలో బరువు తగ్గిపోయాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘కేవలం నెల రోజుల వ్యవధిలో 18 కిలోలు తగ్గాను. కేడీ- ది డెవిల్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలి. జైహనుమాన్ ‘ అని ట్వీట్ చేశాడు ధ్రువ్. కేడీకి ముందు.. తర్వాత అంటూ నెట్టింట షేర్ చేసిన ఈ స్టిల్స్ ఇపుడు వైరలవుతున్నాయి. కన్నడలో రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ను పంపిణీ చేసిన కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని కేడీ సినిమాను తెరకెక్కిస్తోంది. షోమ్యాన్ ప్రేమ్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. కన్నడతోపాటు వివిధ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ సూపర్ హిట్‌గా నిలిచింది.
కాగా గతేడాది గుండెపోటుతో మరణించిన కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా సోదరుడే ఈ ధ్రువ్. యాక్షన్ కింగ్ అర్జున్‌కు స్వయానా మేనల్లుడు. 2012లో అధూరి అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన సోదరుడు చిరంజీవి తరహాలోనే మాస్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే తన పొగరు సినిమాను కన్నడతో పాటు తెలుగులోకి డబ్ చేసి సక్సెస్ కొట్టాడు. ప్రస్తుతం ఇతని చేతిలో కేడీతో పాటు మార్టిన్ అనే సినిమాకూడా ఉంది. ఇక తన వెయిట్‌లాస్ సీక్రెట్ విషయానికొస్తే.. స్ట్రిక్ట్ డైట్‌ను కచ్చితంగా ఫాలో అయ్యారట. అలాగే క్రమం తప్పకుండా వర్కవుట్లు చేశారట.
Lost 18kgs in 30 days
Everything is set to take offNeed all your blessings n love for KD ?
Jai Hanuman ? pic.twitter.com/RcApZG02mP— Dhruva Sarja (@DhruvaSarja) January 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..