Sanjjanaa Galrani: విడాకులు తీసుకోబోతున్న హీరోయిన్.. షాకింగ్ కామెంట్స్ చేసిన సంజన..

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు విడాకులు తీసుకుంటు వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నారు.

Sanjjanaa Galrani: విడాకులు తీసుకోబోతున్న హీరోయిన్.. షాకింగ్ కామెంట్స్ చేసిన సంజన..
Sanjana

Updated on: Jan 05, 2022 | 10:20 AM

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు విడాకులు తీసుకుంటు వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రెటీలు విడాకులు తీసుకున్నామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2021లో అమీర్ ఖాన్, నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నామంటూ అనౌన్స్ చేసి తమ అభిమానులకు షాకిచ్చారు. ఇక గత కొద్ది రోజులుగా మరో హీరోయిన్ సైతం విడాకులు తీసుకోబోతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది కన్నడ బ్యూటీ సంజనా గల్రానీ. 2020లో శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి వచ్చించి. 2020 డిసెంబర్‏లో బెయిల్ పై బయటకు వచ్చిన సంజనా.. ఆ తర్వాత తన చిరకాల మిత్రుడు, ప్రియుడు డాక్టర్ పాషాను 2021 జనవరిలో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సంజనా మీడియాకు దూరంగా ఉంది.

గత కొద్దిరోజులుగా సంజనా వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సంజనకు తన భర్తతో మనస్పర్ధలు వచ్చాయని.. త్వరలోనే వీరిద్దరు విడిపోతున్నారంటూ నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది. ఇవి కాస్త సంజనకు దృష్టికి వెళ్లడంతో.. తనపై వస్తున్న రూమర్స్ పై ఘాటుగా స్పందించింది సంజన. తన వైవాహిక జీవితం బాగుందని.. తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది. అంతేకాకుండా.. ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు సృష్టించవద్దని.. తప్పుడు ప్రచారాలు సృష్టించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని సంజన హెచ్చరించింది.

Also Read: Perni Nani vs RGV: వర్మ ప్రశ్నలకు పేర్ని నాని కౌంటర్ ఎటాక్.. ఏ చట్టం చెప్పిందంటూ..

Anupama Parameswaran: లవ్ బ్రేకప్ గురించి హీరోయిన్ ఓపెన్ కామెంట్స్.. కానీ.. ప్రేమను గుర్తుచేసుకోనంటూ..

 Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి

RGV On AP Govt. సినిమా టికెట్స్ వ్యవహారం.. ఏపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలను సంధించిన రామ్ గోపాల్ వర్మ ..