Kangana Ranaut : ”ఇవన్నీ అమీర్ ఖాన్ చేస్తున్న జిమ్మిక్కులు”.. మరోసారి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌ను టార్గెట్ చేసిన కంగనా

బాలీవుడ్ లో వివాదం అంటే ముందు వినిపించే పేరు కంగనా రనౌత్ అంశం ఏదైనా తనదైన వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చలకు తెరలేపుతుంది ఈ అమ్మడు. కంగనా కామ్ గా ఉందంటే పెద్ద వివాదం ఎదో రాబోతుందని అర్ధం చేసుకోవాలి.

Kangana Ranaut : ''ఇవన్నీ అమీర్ ఖాన్ చేస్తున్న జిమ్మిక్కులు''.. మరోసారి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌ను టార్గెట్ చేసిన కంగనా
Kangana
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 04, 2022 | 3:40 PM

బాలీవుడ్ లో వివాదం అంటే ముందు వినిపించే పేరు కంగనా రనౌత్(Kangana Ranaut ).అంశం ఏదైనా తనదైన వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చలకు తెరలేపుతుంది ఈ అమ్మడు. కంగనా కామ్ గా ఉందంటే పెద్ద వివాదం ఎదో రాబోతుందని అర్ధం చేసుకోవాలి. ఇక ఇప్పటికే ఎన్నో విశాలల్లో విదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా తాజాగా మరోసారి తన నోటికి పనిచెప్పారు. ఈసారి అమీర్ ఖాన్ ఉదేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు కంగనా.. ప్రస్తుతం అమీర్ ఖాన్ నటిస్తున్న సినిమా లాల్ సింగ్ చెడ్డా.. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాను బ్యాన్ చేయాలని ఈ మధ్య హిందూ సంఘాలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

హీరోగా వెర్సటైల్ సినిమాలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు అమీర్ ఖాన్.. ఆయన ఫస్ట్ టైం సత్యమేవ జయతే అనే టెలివిజన్‌ షో చేశారు. సమాజంలో ఉన్న అసమానతలను ఆ షో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు అమీర్. సాజిక రుగ్మతలపై తన గళాన్ని వినిపించారు. ఈ క్రమంలోనే.. దేవుళ్లకు చేసే క్షీరాభిషేకాలపై విమర్శలు చేశారు. దాంతో హిందూ సంఘాలు అమీర్ పై మండిపడ్డాయి. అమీర్ సినిమాలను బ్యాన్ చేయాలని డిమాండ్ కూడా చేశారు. అయితే ఇటీవల లాల్ సింగ్ చడ్డా సినిమాను కూడా బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపించాయి. దాంతో అమీర్ స్పందించి చాలా మంది నాకు దేశం పై గౌరవం లేదు అనుకుంటున్నారు. అది అసత్యం నేను దేశాన్ని గౌరవిస్తాను.. దయచేసి నా సినిమాను ఆపకండి అంటి విజ్ఞప్తి చేశారు. అయితే ఇదంతా అమీర్ చేస్తున్న జిమ్మిక్ అంటోంది కంగనా. `లాల్ సింగ్ చడ్డా` చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను మ్యానేజ్ చేయడానికి మాస్టర్ మైండ్ అమీర్ ఖాన్ పన్నిన పన్నాగమిదని కంగన చెప్పుకొచ్చింది. గత కొంతకాలంగా బాలీవుడ్ లో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్న నేపథ్యంలో తన సినిమాను కాపాడుకోవడానికే అమీర్ ఈ జిమ్మిక్కులు చేస్తున్నారు అని అంటోంది కంగనా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి