Kangana Ranaut: బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్.. దెబ్బకు దేవుడు గుర్తొచ్చాడు.. కంగనా ఇంట్రెస్టింగ్ పోస్ట్
సినిమాలంటే వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కంగనా పెట్టింది పేరు. తాజాగా రెండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇటీవలే కంగనా సౌత్ లో చంద్రముఖి 2 సినిమాలో నటించింది. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో కంగన చంద్రముఖి పాత్రలో కనిపించింది.
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కు ఈ మధ్య కాలం కలిసి రావడం లేదు. చేసిన సినిమా లు దారుణంగా బెడిసికొడుతున్నాయి. కనగ రనౌత్ కు బాలీవుడ్ లో మంచి పేరు ఉంది. సినిమాలంటే వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కంగనా పెట్టింది పేరు. తాజాగా రెండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇటీవలే కంగనా సౌత్ లో చంద్రముఖి 2 సినిమాలో నటించింది. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో కంగన చంద్రముఖి పాత్రలో కనిపించింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమాకు పీ వాసు దర్శకత్వం వహించారు.
అలాగే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తేజస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘తేజస్’ చిత్రం అక్టోబర్ 27న విడుదల కానుంది. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. సైనికుల నేపథ్యంలో తెరకెక్కిన ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తేజస్ సినిమా సమయంలో పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. అయినా కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ పెద్దగా రాలేదు. ఈ సినిమా మొదటి రోజు కేవలం కోటి రూపాయలు మాత్రమే రాబట్టింది. ఈ చిత్రానికి అన్ని వర్గాల నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా 10 కోట్ల రూపాయల గ్రాస్ కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ప్రేక్షకులు లేకపోవడంతో సగం షోలు రద్దయ్యాయని తెలుస్తోంది. దాంతో ఆమె మనస్తాపానికి గురైంది. మనసు క్లియర్ చేసుకోవడానికి గుడికి వెళ్ళింది. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
కంగనా ద్వారకను సందర్శించింది. ఈ సందర్భంగా ఫోటోను షేర్ చేస్తూ క్యాప్షన్ పెట్టింది. ‘కొన్ని రోజులుగా నా గుండె చాలా బాధగా ఉంది. ద్వారకాధీశుని దర్శించాలనిపించింది. శ్రీకృష్ణుడు, ద్వారక నగరానికి వచ్చిన వెంటనే, ఇక్కడి మట్టిని చూసి నా చింతలన్నీ తొలగిపోయినట్లు అనిపించింది. మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలి’ అని రాసుకొచ్చింది. కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమాలో ఇందిరాగాంధీ ఓ పాత్రలో నటిస్తోంది. దర్శకత్వం కూడా ఆమె చేస్తుంది. ఈ సినిమా నిర్మాణంలో కంగనా కూడా భాగం అయ్యింది. తాను కష్టపడి సంపాదించిన మొత్తాన్ని ఈ సినిమాపై పెట్టుబడిగా పెట్టానని చెప్పుకొచ్చింది కంగనా రనౌత్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి