Thangalaan: డైలాగ్స్ లేవు.. అన్నీ అరుపులే.! తంగలాన్ మూవీ బిగ్ సీక్రెట్ రివీల్ చేసిన విక్రమ్
చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ టీజర్ అదిరిపోయింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. టీజర్‌లో విక్రమ్ చాలా వైల్డ్‌గా కనిపించాడు. ఇందులో పార్వతి, మాళవిక మోహన్, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ టీజర్ అదిరిపోయింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. టీజర్‌లో విక్రమ్ చాలా వైల్డ్‌గా కనిపించాడు. ఇందులో పార్వతి, మాళవిక మోహన్, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ఎలాంటి డైలాగ్స్ లేకుండా టీజర్‌ను చూపించారు. కానీ యాక్షన్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని చెప్పచ్చు. టీజర్‌లో పామును పట్టుకుని చేత్తోనే విక్రమ్ రెండుగా చీలుస్తాడు. ఈ సీన్ భారీగా వైరల్ అవుతోంది. టీజర్ విడుదల చేసిన తర్వాత తంగలాన్ గురించి విక్రమ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఆయన రివీల్ చేశాడు. ఈ సినిమాలో ఎక్కడా కూడా విక్రమ్‌కు డైలాగ్స్ ఉండవట. గతంలో శివపుత్రుడు చిత్రంలో కూడా ఆయనకు ఎలాంటి డైలాగ్స్ లేవు కానీ తన నటనతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. టాలీవుడ్ గురించి విక్రమ్ మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ఎంత అభిమానమో తనకు తెలుసని అన్నాడు . కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా వారు ఆదరిస్తారని దానికి నిదర్శనమే శివపుత్రుడని చెప్పాడు. ఆ సినిమాను వారు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారనీ, ఆ సినిమా తనకూ ఎంతోపేరు తెచ్చిపెట్టిందని తెలిపాడు. ఇప్పుడు తంగలాన్ కూడా అంతే పేరు తెస్తుందన్న నమ్మకం ఉందన్నాడు. ఈ చిత్రంలో తనకు ఎలాంటి డైలాగ్స్ లేవనీ అంతా అరవడమే అన్నాడు. దానికి కారణం ఉందని అదేంటో సినిమా చూస్తే ప్రేక్షకులకే అర్థం అవుతుందని అన్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

