Chandramukhi 2 Review: చంద్రముఖి 2 మూవీ రివ్యూ.. సినిమాలో ప్లస్ అండ్ మైనస్ ఇవే..

17 ఏళ్ళ కింద తమిళ-తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా చంద్రముఖి. ఆ తర్వాత చాలా భాషల్లో అది రీమేక్ అయింది కూడా. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చేసారు పి వాసు. రజినీకాంత్ స్థానంలో లారెన్స్ నటించారు. మరి కొత్త చంద్రముఖి ఎలా ఉంది..? నాటి సినిమాను మరిపించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Chandramukhi 2 Review: చంద్రముఖి 2 మూవీ రివ్యూ.. సినిమాలో ప్లస్ అండ్ మైనస్ ఇవే..
Chandramukhi 2 Movie Review

Edited By:

Updated on: Sep 28, 2023 | 5:24 PM

Chandramukhi 2 Review: 17 ఏళ్ళ కింద తమిళ-తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా చంద్రముఖి. ఆ తర్వాత చాలా భాషల్లో అది రీమేక్ అయింది కూడా. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చేసారు పి వాసు. రజినీకాంత్ స్థానంలో లారెన్స్ నటించారు. మరి కొత్త చంద్రముఖి ఎలా ఉంది..? నాటి సినిమాను మరిపించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: చంద్రముఖి 2

నటీనటులు: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, లక్ష్మీ మీనన్, మహిమ నంబియార్, రాధికా శరత్ కుమార్, వడివేలు, మనోబాల తదితరులు

సంగీతం: కీరవాణి

సినిమాటోగ్రఫర్: ఆర్.డి.రాజశేఖర్

మాటలు: రాజేష్ మూర్తి

నిర్మాత: సుభాస్కరన్

రచన-దర్శకత్వం: పి.వాసు

కథ:

రంగనాయకమ్మ (రాధికా శరత్ కుమార్) కుటుంబంలో కొన్నేళ్లుగా అనుకోని సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబ పరంగానే కాకుండా వ్యాపారంలోనూ నష్టాలు వస్తుంటాయి. దాంతో ఒక సిద్ధాంతికి చెప్తే.. ఆయన సూచన మేరకు వాళ్ల పూర్వీకుల ఊళ్లో ఉన్న గుడికి వెళ్లి ప్రత్యేక పూజ చేయడానికి సిద్ధమవుతుంది. అక్కడే ఉండాల్సి రావడంతో.. ఆ గుడికి దగ్గర్లో ఉన్న ఒక పెద్ద భవంతిని లీజుకు తీసుకుని ఆ కుటుంబ సభ్యులందరూ.. పూజ పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆ కోటలోకి వెళ్లిన తర్వాత వాళ్ల సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఆ ఇంట్లో ఉన్న చంద్రముఖి ఆత్మ ఆ కుటుంబంలో ఒకరిని ఆవహిస్తుంది. మరి చంద్రముఖి ఆత్మ ఎవరిని ఆవహించింది.. ఈ సమస్య ఎలా పరిష్కారం అయింది అన్నది మిగతా కథ.

కథనం:

చంద్రముఖి 2 కథ కూడా సేమ్ టూ సేమ్ మొదటి భాగం మాదిరే ఉంటుంది. అదే కథను కాస్త అటు ఇటు తిప్పి తీసాడు దర్శకుడు పి వాసు. ఆల్రెడీ ఆయనే తీసిన చంద్రముఖితో పాటు నాగవల్లి సినిమాలనే మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పార్ట్ 2 చేసాడు పి వాసు. ఆ చంద్రముఖి అంత పెద్ద విజయం సాధించడానికి కారణం రజనీకాంత్.. ఆయన ఛరిష్మా.. దాంతో పాటు స్క్రీన్ ప్లే. కానీ ఇందులో మాత్రం అది కనిపించదు. ఇంకా చెప్పాలంటే సీక్వెల్‌లో స్క్రీన్ ప్లే లోపాలు చాలానే ఉన్నాయి. అప్పుడు యునానిమస్‌గా పేలిన రజనీకాంత్ కామెడీ ఇందులో మాత్రం లారెన్స్ చేతిలో మిస్ అయింది. చంద్రముఖి 2లో వడివేలుతో లారెన్స్ కామెడీ అంతగా పేలలేదు. చంద్రముఖి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అంతగా ఆకట్టుకునే విధంగా లేదు. మొత్తంగా చంద్రముఖి 2తో ఆడియన్స్‌ సహనానికి పరీక్ష పెట్టాడు పి వాసు. చంద్రముఖి 2కు రజినీకాంత్ నో చెప్పినపుడే సినిమాపై డౌట్ రావాల్సింది.. అలా కాదంటే 12 ఏళ్ళ కింద వెంకటేష్ ‘నాగవల్లి’ రిజల్ట్ చూసినపుడైనా అనుమానాలు రావాలి.. ఆ రెండూ కాదని లారెన్స్ ఈ సినిమా చేసాడంటే చంద్రముఖి స్టోరీ మరిచిపోయి ఉండాలనే ట్రోలింగ్ జరుగుతుందిప్పుడు. అతడి నటన.. హావభావాలు ప్రేక్షకులను మామూలుగా ఇరిటేట్ చేయవు.. లారెన్స్‌కు తోడు పి.వాసు ఔట్ డేటెడ్ నరేషన్ తోడై.. ‘చంద్రముఖి-2’ వెటకారంగా తయారైంది.

నటీనటులు:

లారెన్స్ తన పరిధి మేరకు బాగానే రాణించాడు. కానీ తమిళ అతి ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది. పైగా రజనీకాంత్‌తో కంపారిజన్ అనేది పెద్ద మైనస్. ఇక చంద్రముఖిగా కంగనా రనౌత్ యాక్టింగ్ బాగానే ఉన్నా.. దర్శకుడు వైఫల్యం వల్ల ఆమె నటన తేలిపోయింది. క్లైమాక్స్‌లో ఆమె పాత్ర చిత్రీకరణ అంత బాగాలేదు. రాధిక శరత్ కుమార్ తన నటనతో ఆకట్టుకుంది. రావు రమేష్, అయ్యప్ప పి శర్మ ఉన్నంత వరకు ఓకే. వడివేలు కామెడీ కోసం ఎంత ట్రై చేసినా వర్కవుట్ అవ్వలేదు.

టెక్నికల్ టీం:

కీరవాణి సంగీతం పర్వాలేదు. ఆయనేదో అన్యమనస్కంగా పాటలు నేపథ్య సంగీతం అందించినట్లు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అంత బాగోలేదు. ఎడిటింగ్ కూడా వీక్. లైకా ప్రొడక్షన్ ఖర్చు చేసారు కానీ కథ లేక తేలిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ పర్లేదు. క్లైమాక్స్‌లో కుక్కలతో గ్రాఫిక్స్ సన్నివేశాలు తేలిపోయాయి. గ్రాఫిక్ విషయంలో ఇంకా శ్రద్ధ పెడితే బాగుండేది. పి వాసు ఔట్ డేటెడ్ దర్శకత్వం సినిమాకు మైనస్.

పంచ్ లైన్:

చంద్రముఖి 2.. ఔట్ డేటెడ్ నెరేషన్

మరిన్ని సినిమా వార్తలు చదవండి..