AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamalinee Mukherjee: అందుకే తెలుగు సినిమాల్లో నటించలేదు.. ఆనంద్ మూవీ హీరోయిన్..

ఒకప్పుడు సినిమాల్లో చక్రం తిప్పిన ముద్దుగుమ్మలు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఒకటి రెండు సినిమాలతో పాపులర్ అయిన తారలు.. ఇప్పుడు సినిమాలు చేయడం మానేశారు. అలాంటి వారిలో కమలినీ ముఖర్జీ ఒకరు. ఆనంద్ సినిమాతో తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.

Kamalinee Mukherjee: అందుకే తెలుగు సినిమాల్లో నటించలేదు.. ఆనంద్ మూవీ హీరోయిన్..
Kamalinee Mukherjee
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2025 | 7:43 PM

Share

సాధారణంగా తెలుగు సినిమా ప్రపంచంలో అందం, అభినయంతో మెప్పించిన హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. కొందరు ఇప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుండగా.. మరికొందరు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. తక్కువ సినిమాలతోనే అడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసిన తారలలో కమలినీ ముఖర్జీ ఒకరు. ఆనంద్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి చిత్రంతోనే జనాల హృదయాలు దొచుకుంది. ఫస్ట్ మూవీతోనే పాపులర్ అయిన ఈ అమ్మడు.. ఆ వెంటనే గోదావరి సినిమాతో మరోసారి వెండితెరపై మాయ చేసింది. స్టైల్, గమ్యం వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ నటిగా మంచి మార్కులు కొట్టేశారు. అయితే ఈ అమ్మడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది. దాదాపు పదేళ్లుగా మరో సినిమా చేయలేదు. అటు సోషల్ మీడియాలోనూ అంతగా కనిపించడం లేదు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు.. అందుకు గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..

ఓ సినిమాలో పోషించిన పాత్ర తాను ఊహించినంత స్థాయిలో తెరకెక్కలేదని.. దీంతో ఆ క్యారెక్టర్ పై అసంతృప్తి కలిగిందని చెప్పుకొచ్చారు. ఆ విషయంలో ఫీలయ్యాయనని .. అందుకే తెలుగు సినిమాల్లో నటించలేదని చెప్పుకొచ్చారు. ఇక హీరోల గురించి మాట్లాడుతూ.. నాగార్జున ఇప్పటికీ ఎంతో హ్యాండ్సమ్ గా ఉన్నారని..సహ నటులతో ఎంతో సరదాగా ఉంటారని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..

ఇక శర్వానంద్ సహజంగా నటిస్తారని.. అంకిత భావంతో పనిచేస్తారని అన్నారు. స్టార్ అని నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదని చెప్పుకొచ్చారు. 2014లో వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత కమిలినీ ముఖర్జీ తెలుగులో మరో సినిమా చేయలేదు. తమిళంలో మాత్రం ఇరైవి సినిమాలో కనిపించింది. అలాగే మలయాళంలో పులిమురుగన్ సినిమాలో నటించింది. చాలా కాలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..

ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్.. 

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం