Vikram Movie: విక్రమ్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. మేకింగ్ వీడియో అదుర్స్..

తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్‏కు (Kamal Hasaan) తెలుగులోనూ ఫాలోయింగ్ ఎక్కువే.. కమల్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తుంటుంది

Vikram Movie: విక్రమ్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..  మేకింగ్ వీడియో అదుర్స్..
Vikram

Updated on: Mar 14, 2022 | 10:16 AM

తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్‏కు (Kamal Hasaan) తెలుగులోనూ ఫాలోయింగ్ ఎక్కువే.. కమల్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తుంటుంది. అయితే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ స్టారో హీరోకు.. గత కొద్ది కాలంగా అస్సలు కలిసి రావడం లేదు. గత కొన్నెళ్లుగా ఆయన నటించిన చిత్రాలు ఆశించినంతగా హిట్ కావడం లేదు. దీంతో ఇటు బుల్లితెరపై బిగ్ బాస్ షోతో ప్రేక్షకులను అలరించాడు.. మరోవైపు రాజకీయాల్లో ఎక్కువగా దృష్టి పెడుతూనే.. సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం విక్రమ్ (Vikram). డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా తెలిపింది. విడుదల తేదీతోపాటు.. విక్రమ్ మేకింగ్ వీడియోను సైతం షేర్ చేసింది చిత్రయూనిట్. ఇందులో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన గ్లింప్స్ చూపించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమాలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తుండడంతో మూవీ అంచనాలు బారీగా పెరిగాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Ram Charan-Upasana: చిన్నపిల్లాడిగా మారిన చెర్రి.. లోకాన్ని మరిచి చిలిపి పనులతో అల్లరి చేసిన మెగా కపూల్..

Viral Photo: కురుల మాటున మోము దాచిన అందాల సీతాకోకచిలక.. స్టార్ హీరో తనయ.. ఎవరో గుర్తుపట్టండి..

Poonam Kaur: ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే చేయలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ పూనమ్ కౌర్..

Bandla Ganesh: దేవర జెండాకి కర్రనౌతా.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ రచ్చ..