Kamal Haasan: యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రానున్న కమల్.. విక్రమ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేది అప్పుడే..

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ విక్రమ్. కమల్ హాసన్ 232వ సినిమాగా ఈమూవీ రాబోతుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో సౌత్ ఇండియన్ స్టార్స్ అయిన ఫాహద్ ఫాజిల్..

Kamal Haasan: యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రానున్న కమల్.. విక్రమ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేది అప్పుడే..
Kamal

Updated on: Mar 12, 2022 | 7:58 AM

Kamal Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ విక్రమ్. కమల్ హాసన్ 232వ సినిమాగా ఈమూవీ రాబోతుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో సౌత్ ఇండియన్ స్టార్స్ అయిన ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, నరైన్, కాళిదాస్ జయరాం వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత కెమెరామెన్ గిరీష్ గంగాధరణ్, ఎడిటర్ ఫిలోమిన్ రాజ్, ఆర్ట్ డైరెక్టర్ సతీష్, కొరియోగ్రఫర్ శాండీ, యాక్షన్ డైరెక్టర్ అంబరివ్‌ పనిచేస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్, కమల్ హాసన్ సంయుక్తంగా విక్రమ్ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా దాదాపు ఐదు భాషల్లో ఏక కాలంలో ఈ మూవీ రిలీజ్ కానుంది. తెలుగులో `విక్రమ్ హిట్ లిస్ట్` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మార్చి 14న ఉదయం 7 గంటలకు ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామంటూ తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈమేరకు మూవీ నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈపోస్టర్ లో కమల్ చేతిలో కత్తి పట్టుకుని  యాక్షన్ మూడ్ లో కనిపించారు. అయితే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యి ఉండేది కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక మార్చిలోనూ భారీ చిత్రాల రిలీజ్ లు వుండటంతో ఫైనల్ గా `విక్రమ్` రిలీజ్ ని ఏప్రిల్ కి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీని ఏప్రిల్ 29న రిలీజ్  చేసే ఛాన్స్ లు ఉన్నాయని తెలుస్తుంది.

Kamal Haasan

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: డిఫరెంట్ డ్రెస్సులతో పిచ్చెకిస్తున్న పూజ హెగ్డే.. చూస్తే వావ్ అనాల్సిందే

Surbhi: సరికొత్త లుక్ లో అందాల భామ సురభి… నెట్టింట ఫోటోస్ వైరల్

Radhe Shyam: రాధేశ్యామ్‌ స్లోగా ఉందన్న వారికి.. అదిరిపోయే పంచ్‌ ఇచ్చిన థమన్‌.. వైరల్‌ అవుతోన్న మీమ్‌..