
లోక నాయకుడు కమల్ హాసన్ నటన గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఆయన తన నటనా ప్రతిభతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. ఎన్నో ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్ తో పాటు పద్మ శ్రీ, పద్మభూషణ్ లాంటి ప్రతిష్ఠహ్మక అవార్డులు అందుకున్నారు కమల్. ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా విక్రమ్ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు కమల్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కమల్ హాసన్ ఇప్పటివరకు 233 సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన కెరీర్ లో 234వ సినిమా రానుంది.
తాజాగా ఈ మూవీని అనౌన్స్ చేశారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకు సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు మూవీ మేకర్స్. అండ్ ఇట్ బిగిన్స్. రైజ్ టు రూల్ అంటూ కమల్ హాసన్ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. దాంతో కమల్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియాన్ 2 లో నటిస్తున్నారు. ఈ సినిమా గతంలో వచిఅన్ ఇండియన్ మూవీకి సీక్వెల్ గా రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత వినోద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు కమల్.
And it begins…#RKFI52 #KH233
#RISEtoRULE #HVinoth #Mahendran @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/7cej87cghE— Kamal Haasan (@ikamalhaasan) July 4, 2023