Kamal Haasan: క్షమాపణ చెప్పనన్న కమల్.. థగ్ లైఫ్ సినిమా ప్రదర్శిస్తే థియేటర్లు కాల్చేస్తామని హెచ్చరికలు..

కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయాలంటే కమల్ క్షమాపణ చెప్పాల్సిందేనని కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే ప్రకటించింది. ఆయన కనుక క్షమాపణ చెప్పకపోతే సినిమాను బ్యాన్ చేస్తామని అన్నారు.

Kamal Haasan: క్షమాపణ చెప్పనన్న కమల్.. థగ్ లైఫ్ సినిమా ప్రదర్శిస్తే థియేటర్లు కాల్చేస్తామని హెచ్చరికలు..
Thug Life Film

Updated on: May 31, 2025 | 12:47 PM

డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న సినిమా థగ్ లైఫ్. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇటీవల కన్నడ భాషపై కమల్ హాసన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు మండిపడుతున్నారు. ఆయన క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో బ్యాన్ చేస్తామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫర్ కామర్స్ ప్రకటించింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తప్పు చేస్తే క్షమాపణ చెబుతానని కమల్ మరోసారి కామెంట్స్ చేయడంతో ఆయన తీరుపై మండిపడుతున్నారు కన్నడిగులు. అయితే ఇప్పుడు థగ్ లైఫ్ సినిమా విడుదలైతే థియేటర్లను తగలబెడతామని కన్నడ అనుకూల సంస్థలు హెచ్చరించాయి.

కన్నడ భాష వివాదం.. థగ్ లైఫ్ సినిమాను బ్యాన్ చేస్తామని.. ఒకవేళ ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తే థియేటర్లు తగలబెడతామని కన్నడ సంస్థలు హెచ్చరించినప్పటికీ.. ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు కొన్ని థియేటర్లు ముందుకు వచ్చాయి. దీంతో ఇప్పుడు కర్ణాటకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే తాము తమిళనాడు ఫిల్మ్ ఛాంబర్ కు లేఖ రాశామని.. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలన్నింటినీ రాష్ట్రంలో బ్యాన్ చేస్తామని కేఎఫ్సీసీ అధ్యక్షులు తెలిపారు.

మరోవైపు ఈ వివాదం పై కమల్ హాసన్ వెనక్కు తగ్గడం లేదు. తను ఏ తప్పు చేయలేదని.. బెదిరింపులకు ఏమాత్రం భయపడేది లేదని.. క్షమాపణ చెప్పనని అన్నారు కమల్. మే 30న విలేకరుల సమావేశం నిర్వహించిన కేఎఫ్సీసీ అధ్యక్షుడు నారాయణ గౌడ, కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రాన్ని విడుదల చేస్తే ఏ సినిమాహాళ్లనైనా తగలబెడతానని హెచ్చరించారు. బెంగళూరులోని ప్రసిద్ధ సింగిల్ స్క్రీన్లలో ఒకటైన ‘విక్టరీ సినిమాస్’ దీని గురించి సోషల్ మీడియాలో రాసింది. ‘థగ్ లైఫ్’ చిత్రానికి ముందస్తు బుకింగ్‌లు త్వరలో ఓపెన్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఆ థియేటర్ యాజమాన్యంపై మండిపడుతున్నారు కన్నడిగులు. ఐపీఎల్ కారణంగా పెద్ద సినిమాలు విడుదల కాలేదు. ఇప్పుడు పెద్ద సినిమాలు విడుదలయ్యే సమయంలో వివాదాలు చెలరేగడంతో థియేటర్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ‘థగ్ లైఫ్’ సినిమా తమిళం, హిందీ, మలయాళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇందులో శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యలక్ష్మి, అభిరామి కీలకపాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..