Kamal Haasan: చిరంజీవి అలా అనుకుని ఉంటే తమిళ ఇండస్ట్రీని ఏలేవారు: కమల్ హాసన్

కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తమిళ సినీ రంగంలో సులువుగా పెద్ద స్టార్ అయ్యే అవకాశముందని పేర్కొన్నారు. అయితే, చిరంజీవికి ఆసక్తి లేకపోవడమే కారణమని తెలిపారు. గతంలో ఏఎన్ఆర్ గారిని తాను ఇంటర్వ్యూ చేసినప్పుడు, తమిళంలో ఆయన చిత్రాలు సిల్వర్ జూబిలీలు సాధించినా ఎందుకు కొనసాగించలేదని అడిగారట. దానికి ఏఎన్ఆర్, శివాజీ గణేశన్ అనే ‘తుఫాన్’ వల్ల తాను హైదరాబాద్ తిరిగి వచ్చానని బదులిచ్చారు.

Kamal Haasan: చిరంజీవి అలా అనుకుని ఉంటే తమిళ ఇండస్ట్రీని ఏలేవారు: కమల్ హాసన్
Kamal Haasan - Chiranjeevi

Updated on: Jan 18, 2026 | 7:16 AM

ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి తమిళ సినీ రంగ ప్రవేశం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తమిళ చిత్ర పరిశ్రమలో సులువుగా పెద్ద స్టార్‌గా ఎదిగే అవకాశం ఉందని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. అయితే, ఆయనకు తమిళంలో నటించేందుకు ఆసక్తి లేకపోవడమే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. తమిళ ప్రేక్షకులు చిరంజీవిని కోరుకోలేదని భావించడం సరికాదని కమల్ హాసన్ అన్నారు.

ఈ సందర్భంగా కమల్ హాసన్ 35-40 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావ గారిని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఒక ప్రశ్న అడిగారట. ఏఎన్ఆర్ అనేక సినిమాలు తమిళంలో రెండు సంవత్సరాలు రన్ అయి సిల్వర్ జూబిలీలు జరుపుకున్నప్పటికీ, ఆయన తమిళ చిత్ర పరిశ్రమలో ఎందుకు కొనసాగించలేదని కమల్ ప్రశ్నించారు. దానికి ఏఎన్ఆర్ , తాను ఎప్పటికీ మర్చిపోలేని ఒక సమాధానం ఇచ్చారని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఒక ‘తుఫాన్’ వచ్చిందని, దాని కారణంగా తాను హైదరాబాద్‌కు తిరిగి వచ్చానని ఏఎన్ఆర్ బదులిచ్చారట. ఆ ‘తుఫాన్’ పేరు శివాజీ గణేశన్ అని కమల్ హాసన్ వివరించారు. ఈ సంభాషణ చిరంజీవి తమిళ అవకాశాలపై చర్చకు దారితీసింది.