Kamal Haasan : కమల్ హాసన్ భారతీయుడు 2 షూటింగ్ రీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

|

Jul 07, 2022 | 4:30 PM

లోకనాయకుడు కమల్ హాసన్ రీసెంట్ గా విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Kamal Haasan : కమల్ హాసన్ భారతీయుడు 2 షూటింగ్ రీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?
Kamal Haasan
Follow us on

లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan)రీసెంట్ గా విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అందుకోవడమే కాకుండా వసూళ్లు కూడా బాగానే రాబట్టింది. ఇక ఇప్పుడు కమల్ నెక్ట్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు ఆయన ఫ్యాన్స్.. అయితే ఎప్పుడో ఆగిపోయిన భారతీయుడు 2 సినిమా ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. కమల్ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన భారతీయుడు సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ఈ మూవీ పలు కారణాల వలన తాత్కాలికంగా చిత్రీకరణ ఆగిపోయింది..

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఇందుకోసం చిత్రయూనిట్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రస్తుతం శంకర్ తెరకెక్కిస్తున్న ఆర్సీ 15 షూటింగ్ కంప్లీట్ కాగానే.. భారతీయుడు 2 మూవీ పట్టాలెక్కుతుంది అంటూ ఇటీవల కమల్  చెప్పుకొచ్చారు. భారతీయుడు 2 మూవీ షూటింగ్ ను ఆగస్టు మొదటి వారం లో ప్రారంభించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్స్ గా రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ పేర్లు వినిపించాయి. అయితే కాజల్ కు పెళ్లి కావడం, ఓ బిడ్డకు జన్మనివ్వడంతో కాజల్ ఈ ప్రాజెక్ట్ లో ఉండకపోవచ్చని అంటున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి