Kalki2898AD : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన కల్కి మూవీ టికెట్ ధరలు

|

Aug 02, 2024 | 11:27 AM

‘కల్కి 2898 ఏడీ’ సినిమా భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు 1200 కోట్ల రూపాయలకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ వసూళ్లు పెంచేందుకు మూవీ టీమ్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ సినిమా టికెట్ ధరను తగ్గించారు. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Kalki2898AD : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన కల్కి మూవీ టికెట్ ధరలు
Kalki Movie
Follow us on

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి సినిమా తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అలాగే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు 1200 కోట్ల రూపాయలకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ వసూళ్లు పెంచేందుకు మూవీ టీమ్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ సినిమా టికెట్ ధరను తగ్గించారు. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  టిక్కెట్టు ధరలు చూసి థియేటర్‌కి వెళ్లని వారు ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను తక్కివ ధరకు థియేటర్స్ లో చూడొచ్చు.

ఇది కూడా చదవండి : నువ్వొస్తానంటే నేనొద్దంటానా‌లో నటించిన ఈ అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

కల్కి 2898 ఏడీ’ టికెట్ ధర రూ.100కి తగ్గింది. ఈ ఆఫర్ ఆగస్టు 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు అంటే ఈ నెల 9వ తేదీ వరకు ఉండనుంది. రూ. 100 టిక్కెట్ ధరతో పాటు పన్నులు, షరతులు వర్తిస్తాయని బృందం పేర్కొంది. సినిమా విడుదలై ఇప్పటికే నెల రోజులు దాటింది. ‘కల్కి 2898 ఏడీ’ విడుదలైన తర్వాత చాలా సినిమాలు విడుదలయ్యాయి. కానీ కల్కి కలెక్షన్స్ ను మాత్రం ఆపలేకపోయాయి. అయితే టికెట్ ధర పెంచడంతో సామాన్యులు కొంతమంది ఈ సినిమాను థియేటర్స్ లో చూడటానికి వెనకాడరు. అయితే టికెట్ ధర 100 రూపాయలుగా నిర్ణయిస్తే జనాలు ఎక్కువగా థియేటర్ వైపు మొగ్గు చూపుతారని మేకర్స్ భావిస్తున్నారు. ఈమేరకు వారం రోజుల పాటు టికెట్ ధరను తగ్గించారు.

ఇది కూడా చదవండి : Vikramarkudu: విక్రమార్కుడు విలన్ భావుజీ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.?

అయితే.. వీకెండ్ కావడంతో బెంగుళూరులో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా టిక్కెట్ ధరలు 150-200 రూపాయలకు అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది. కానీ మనదగ్గర టికెట్ ధర రూ. 100 అయ్యింది. ఇంకేం ఇప్పటికే సినిమా చూసిన వారు మరోసారి ఈ సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. చూడని వారు ఇప్పుడు చూసేంయండి.. ఇక కల్కి 2898 ఏడీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ కీలకపాత్రలో నటించారు. అలాగే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ గా కనిపించాడు. వీరితో పాటు మరికొంతమంది కూడా ఈ మూవీలో కనిపించారు. అలాగే ఈ సినిమాను మరికొన్ని భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే కల్కి 2 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని మేకర్స్ వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.