
టాలీవుడ్ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ను సొంతం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంటుంది. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు మేకర్స్ కూడా సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లను షేర్ చేస్తూనే ఉన్నారు. ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ కోసంఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా ఉండనుంది.
జూన్ 27న ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ చిత్ర ట్రైలర్‌ను జూన్ 10న గ్రాండ్ లెవల్‌లో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ‘కల్కి 2898 AD’కి సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ భారీ ప్రచారం జరగనుందని తెలుస్తోంది. మేకర్స్ ఈ మూవీ ప్రమోషన్ కోసం అక్కడ భారీ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. దీపికా, అమితాబ్ ఉండటంతో బాలీవుడ్‌లో ప్రమోషన్ తప్పనిసరి.
‘కల్కి 2898 AD’లో దీపిక, అమితాబ్‌లు పవర్‌ఫుల్ పాత్రలు పోషించబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ముంబైలో భారీ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ను నిర్వహించనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మేకర్స్ వేదిక కోసం అన్వేషణలో బిజీగా ఉన్నారు. ఈ ఈవెంట్‌లో మేకర్స్ కొన్ని అప్డేట్స్ కూడా ఇవ్వనున్నారట. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా తర్వాత సలార్ 2, రాజా సాబ్, స్పిరిట్ సినిమాల్లోనూ నటిస్తున్నాడు డార్లింగ్
𝐀 𝐍𝐄𝐖 𝐖𝐎𝐑𝐋𝐃 𝐀𝐖𝐀𝐈𝐓𝐒!#Kalki2898AD Trailer on June 10th. @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/5FB0Mg6kNi
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 5, 2024
Thank you, Jaipur! 🩷
We’re overwhelmed by the amazing love for #BujjiAndBhairava at screenings across the city.#BujjiAndBhairavaOnPrime, watch now on @PrimeVideoIN. https://t.co/9zxxkEd9HK#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7… pic.twitter.com/R5SCT0SbWm— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.