
బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. ఇప్పుడు వెండితెరపై గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. హీరోగా తనను తాను నిరూపించుకుంటూ వరుస సినిమాలతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సుధీర్.. ఇప్పుడు కాలింగ్ సహస్ర సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సుధీర్ సరసన డోలిశ్య హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా కలయా నిజమా అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన సాంగ్ వింటుంటే.. హీరోపై హీరోయిన్ కు ప్రేమ పుట్టినప్పుడు వచ్చే పాటల అనిపిస్తుంది. ఈ చిత్రానికి మెహిత్ రహ్ మానిక్ సంగీతం అందిస్తుండగా.. కలయా నిజమా పాటకు లక్ష్మీ ప్రియాంక సాహిత్యం అందించారు. ప్రముఖ సింగర్ కె.చిత్ర ఈ మధురమైన గీతాన్ని ఆలపించారు. ఈ సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘సహస్త్ర కాలింగ్’ చిత్రం నుంచి ‘కలయా నిజమా…’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశాం. లెజెండ్రీ సింగర్ చిత్రగారు అద్భుతంగా పాడారు. మోహిత్ రెహమానిక్ అందించిన ట్యూన్, దానికి లక్ష్మీ ప్రియాంకగారు రాసిన లిరిక్స్ బ్యూటీఫుల్‌గా కుదిరాయి. సుడిగాలి సుధీర్, డోలిశ్య మధ్య కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంటుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.