Satyabhama Movie Review: సత్యభామ మూవీ రివ్యూ.. కాజల్ అగర్వాల్ యాక్షన్ డ్రామా మెప్పించిందా.?

| Edited By: Rajeev Rayala

Jun 07, 2024 | 12:27 PM

ఇప్పటివరకు గ్లామర్ హీరోయిన గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్.. తొలిసారి లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించారు. ఈమె నటించిన సత్యభామ సినిమా తాజాగా విడుదలైంది. ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Satyabhama Movie Review: సత్యభామ మూవీ రివ్యూ.. కాజల్ అగర్వాల్ యాక్షన్ డ్రామా మెప్పించిందా.?
Satyabhama Movie
Follow us on

మూవీ రివ్యూ: సత్యభామ

నటీనటులు: కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, నేహా పటాన్, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ తదితరులు

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్

సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి

స్క్రీన్ ప్లే: శశికిరణ్ తిక్క

కథ, దర్శకత్వం: సుమన్ చిక్కాల

నిర్మాతలు: బాబీ తిక్క, శ్రీనివాస తక్కెలపల్లి

ఇప్పటివరకు గ్లామర్ హీరోయిన గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్.. తొలిసారి లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించారు. ఈమె నటించిన సత్యభామ సినిమా తాజాగా విడుదలైంది. ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

ఏసీపీ సత్యభామ (కాజల్ అగర్వాల్) చాలా సిన్సియర్ ఆఫీసర్. తన డ్యూటీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయదు. ఆమె భర్త అమరేందర్ (నవీన్ చంద్ర) మంచి రైటర్. పెళ్లి చేసుకుని హాయిగా సాగిపోతున్న సత్యభామ జీవితంలోకి అనుకోకుండా ఒక కేసు రూపంలో హసీనా (నేహా పఠాన్) వస్తుంది. తన భర్త నుంచి వేధింపులు వస్తున్నాయని చెప్పడంతో ఆమెను కాపాడడానికి ప్రయత్నిస్తుంది సత్యభామ. కానీ అనుకోని పరిస్థితుల్లో హసీనా చనిపోవడంతో పాటు ఆమె తమ్ముడు ఇక్బాల్ కూడా ఇబ్బందుల్లో పడతారు. అప్పుడు సత్తిబాబు ఏం చేసింది.. ఆ కేసులు ఎలా సాల్వ్ చేసింది.. అసలు హసీనాను చంపింది ఎవరు.. అనేది మిగిలిన కథ..

కథనం:

ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలంటే అల్లాటప్పా సబ్జెక్టు ఉంటే సరిపోదు. అద్భుతమైన కథతో పాటు.. కట్టిపడేసే స్క్రీన్ ప్లే కూడా ఉండాలి. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా మిస్ ఫైర్ అవ్వడం ఖాయం. సత్యభామ విషయంలో ఈ రెండు మిస్ ఫైర్ కాకుండా బ్యాలెన్స్ చేయాలని చూశాడు దర్శకుడు సుమన్ చిక్కాల. కాజల్ లాంటి క్లాసీ హీరోయిన్ తో యాక్షన్ సినిమా చేయాలనుకోవడం సాహసమే. సినిమా మొదటి నుంచి సీరియస్ మోడ్ లోనే వెళుతుంది. గత ముందుకు సాగుతున్న కొద్ది ఊహించిన దానికంటే ఎక్కువ ట్విస్టులు వస్తాయి. అయితే ఒకటి రెండు సార్లు మాత్రమే ఆ ట్విస్టులు ఆసక్తిగా ఉన్నాయి. ఫస్టాఫ్ చాలా వరకు స్లోగా సాగింది.

సెకండాఫ్ మర్డర్ మిస్టరీని చేయిస్తూ ముందుకు సాగుతుంది. మొదట్లో మర్డర్ మిస్టరీ.. ఆ తర్వాత ఉమెన్ ట్రాఫికింగ్.. ఆ వెంటనే డ్రగ్స్.. ఇవన్నీ చాలా అన్నట్టు ఒక వీడియో గేమ్.. అందులో జరిగే క్రైమ్.. ఇలా ఒకే కథలో ఎక్కువ అంశాలు జోడించడంతో గజిబిజిగా అనిపించింది. క్లైమాక్స్ కూడా తేలిపోయింది.. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త బెటర్. కాజల్ను మాస్ హీరోయిన్గా ఎలివేట్ చేయడానికి ఏ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇంటర్వెల్ కు ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ బాగా డిజైన్ చేశారు. కాకపోతే కథలో చాలా వరకు స్లో నెరేషన్ ఇబ్బంది పెట్టింది. గూడచారి, మేజర్ లాంటి సినిమాలు చేసిన శశికిరణ్ టిక్క సత్యభామ విషయంలో కూడా అదే స్క్రీన్ ప్లే ఫార్మేట్ ఫాలో అయ్యాడు. కాకపోతే రేసి స్క్రీన్ ప్లే లేకపోవడంతో సత్యభామ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

నటీనటులు:

కాజల్ అగర్వాల్ సత్యభామ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. యాక్షన్ సన్నివేశాలు కూడా అదరగొట్టింది. నవీన్ చంద్ర జస్ట్ సపోర్టింగ్ రోల్ చేశాడు. నేహా పఠాన్ క్యారెక్టర్ చిన్నదే అయినా ఇంపాక్ట్ పెద్దది. ప్రకాష్ రాజ్, హర్షవర్ధన్ లాంటి వాళ్ళు చిన్న చిన్న పాత్రలు చేశారు. పాయల్ రాధాకృష్ణ సహా మరో ముగ్గురు యంగ్ యాక్టర్స్ ఇందులో బాగా నటించారు.

టెక్నికల్ టీమ్:

సత్యభామ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ శ్రీ చరణ్ పాకాల సంగీతం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు ఈయన. ఎడిటింగ్ కూడా పర్లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క అందించిన స్క్రీన్ ప్లే తన సినిమాలనే గుర్తు చేసింది. దర్శకుడుగా సుమన్ చిక్కాల 70 శాతం మాత్రమే సక్సెస్ అయ్యాడు అనిపించింది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా సత్యభామ.. కాస్త కష్టమే అమ్మ..!