తెలుగోడి సత్తా..’అవెంజర్స్ ఎండ్ గేమ్’ పత్తా లేదు

| Edited By: Srinu

Dec 12, 2019 | 4:16 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘అర్జున్ రెడ్డి’  ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ మూవీతోనే  విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారాడు. అనేక మంది హీరోలు, నిర్మాతలు రిజెక్ట్ చేసిన ఈ స్రిప్ట్..బాలీవుడ్‌లో కూడా ‘కబీర్ సింగ్’ పేరుతో తెరకెక్కింది. అక్కడ కూడా మూవీ ఊహించని విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించింది. అక్కడ కూడా మన తెలుగు దర్శకుడు సందీప్ వంగానే డైరెక్ట్ చేశాడు. షాహిద్ కపూర్,  కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా నటించారు. […]

తెలుగోడి సత్తా..అవెంజర్స్ ఎండ్ గేమ్ పత్తా లేదు
Follow us on

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘అర్జున్ రెడ్డి’  ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ మూవీతోనే  విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారాడు. అనేక మంది హీరోలు, నిర్మాతలు రిజెక్ట్ చేసిన ఈ స్రిప్ట్..బాలీవుడ్‌లో కూడా ‘కబీర్ సింగ్’ పేరుతో తెరకెక్కింది. అక్కడ కూడా మూవీ ఊహించని విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించింది. అక్కడ కూడా మన తెలుగు దర్శకుడు సందీప్ వంగానే డైరెక్ట్ చేశాడు.

షాహిద్ కపూర్,  కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ జనాల్ని ఈ మూవీ డిస్టబ్ చేసిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ విషయం ఎందుకు చెప్తున్నామంటే, గూగుల్ 2019లో టాప్ సెర్చ్‌డ్ మూవీ జాబితాను విడుదల చేసింది. అనూహ్యంగా హాలీవుడ్ సినిమా ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ ను కూడా దాటి కబీర్ సింగ్ చెలరేగిపోయింది. ‘కబీర్ సింగ్’..టాప్ సెర్చర్‌గా నిలిచింది. వాస్తవానికి ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ స్థాయి వేరు, స్థానం వేరు. ఆ మూవీకి దేశవ్యాప్తంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాటన్నిటిని దాటి కూడా మన తెలుగు దర్శకుడు తెరకెక్కించిన ‘కబీర్ సింగ్’ ముందుడటం నిజంగా గొప్ప విషయం. దీంతో మరోసారి తెలుగోడి సత్తా ఇండియా మొత్తం పాకింది.