
దాదాపు 17 ఎల్లా క్రిత్రం విడుదలైన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా హారర్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ మూవీలో జోతిక చంద్రముఖిగా నటించి మెప్పించింది. చంద్రముఖి పాత్రలో జోతిక నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. చంద్రముఖిగా జోతిక నటన ఇప్పటికీ ప్రేక్షకులను భయపెడుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించిన పీవి వాసునే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ అయ్యింది.
మొనీమధ్య విడుదలైన చంద్రముఖి మూవీ ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసింది. అయితే ఈ మూవీ ట్రైలర్ పై ట్రోల్స్ కూడా బాగానే వస్తున్నాయి. చంద్రముఖి సినిమాకు ఇప్పుడు రానున్న చంద్రముఖి 2 సినిమాకు పెద్దగా తేడా లేకపోవడం. అలాంటి కథతోనే మరోసారి సినిమా చేయడం ప్రేక్షకులను కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి.
ఆమె నటన నన్ను ఆకట్టుకుంది. కంగనా నటన అంటే నాకు చాలా ఇష్టం. చంద్రముఖి 2 సినిమా టీమ్ కు నా విషెస్ అని తెలిపింది జోతిక. అంతకు ముందు చెన్నైలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో జోతిక పై కంగనా కూడా ప్రశంసలు కురిపించింది. జోతిక నటనతో నన్ను పోల్చకండి. ఆమె అద్భుతంగా నటించింది. నేనే అసలైన చంద్రముఖిని అంటూ చెప్పుకొచ్చారు కంగనా. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ సాధిస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.