NTR New Car: కొన్ని వార్తలు ఎలా పుట్టుకుస్తాయో తెలియదు కానీ వైరల్‌గా మారుతుంటాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన ఈ రోజుల్లో ‘ఇదిగో తోక అంటే అదిగో పాము’ అన్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తల్లో కొన్ని నిజమైనవి ఉంటే మరికొన్ని మాత్రం ఫేక్ వార్తలుగా మిగిలిపోతున్నాయి. తాజాగా అలాంటి వార్తే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్ రూ. 5 కోట్ల విలువైన ఓ కారును కోనుగోలు చేశారని వార్తలు షికార్లు చేసిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా జూనియర్ ఆ కారును తొలిసారి డ్రైవ్ చేసుకుంటూ రామ్ చరణ్ ఇంటికి వెళ్లాడని వార్తలు తెగ వైరల్‌గా మారాయి. ఇందులో భాగంగా ఓ లగ్జరీ కారు ఫొటో నెట్టింట హల్చల్ చేసింది.
అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఎన్టీఆర్ మేనేజర్ మహేష్ కోనేరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఎన్టీఆర్ కొత్త కారును కొనుగోలు చేయలేదు. రామ్ చరణ్ ఇంటి ముందు ఉన్నది ఎన్టీఆర్ కారేనని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. కానీ ఇందులో ఏమాత్రం నిజంలేదని తేల్చి చెప్పారు. దీంతో నెట్టింట వైరల్ అవుతోన్న ఎన్టీఆర్ కొత్త కారు వార్తలు పూర్తిగా అవాస్తవమని తేలింది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతానికి కొత్త కారును కొనుగోలు చేయకపోయినా.. ఇప్పటికే ఓ కారును బుక్ చేసుకున్నాడని మేనేజర్ తెలిపారు. ఎన్టీఆర్ కొన్నాళ్ల క్రితమే లంబోర్గిని ఉరుస్ మోడల్‌ను బుక్ చేసుకున్నారని తెలిపారు. ఈ కారు ఇటలీ నుంచి భారత్‌కు రావాల్సి ఉండగా డెలివరీకి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయని మహేష్ క్లారిటీ ఇచ్చారు. ఇదండీ ఎన్టీఆర్ కొత్త కారు వెనక ఉన్న అసలు కథ.
Also Read: Enemy Teaser: ఆకట్టుకొంటున్న ఎనిమీ మూవీ టీజర్.. యాక్షన్ పాకెడ్‌గా రానున్న మూవీ
Tollywood: ప్రజంట్ అడ్వంచరస్ టూర్‌లో ఉన్న ఈ టాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టగలరా..?
Pushpa Movie: ‘పుష్ప’ సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేసిన శ్రీతేజ్.. మరో లెవల్ అట..