సైమా అవార్డ్ 2023 వేడుకలు దుబాయ్లో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు సౌత్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోహీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హాజరయ్యారు. ఇక టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, శ్రీలీల, అడివి శేష్ తదితరులు సైమా అవార్డ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఇందులో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని కొమురం భీమ్ పాత్రకు గానూ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. అనంతరం స్టేజ్ పై తారక్ మాట్లాడిన మాటలు అభిమానుల్ని కదిలించాయి. తన ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టమనేది చెప్పకనే చెప్పేశాడు. “నా ఒడిదుడుకుల్లో, నేను క్రిందపడ్డప్పుడెళ్ళా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నా కనుల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా భాద పడినందుకు, నేను నవ్వినప్పుడెళ్ళ నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు, నా అభిమాన సొదరులందరికి పాదాభి వందనాలు” అంటూ ఎమోషనల్ అయ్యారు తారక్.
సాధారణంగా సెలబ్రెటీల చుట్టూ ఫోటోగ్రాఫర్స్ ఉంటారన్న సంగతి తెలిసిందే. సినీతారలు ఎక్కడ కనిపించిన వారిని ఫోటోస్, వీడియోస్ తీసేందుకు రెడీగా ఉంటారు. చాలా మంది స్టార్స్ ఫోటోగ్రాఫర్లతో ప్రేమగా మాట్లాడుతుంటారు. అలాగే ఇప్పుడు తారక్ కూడా ఓ ఫోటోగ్రాఫర్తో మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా మంగళవారం తారక్ దుబాయ్ నుంచి హైదరాబాద్ రిటర్న్ అయ్యారు. ఆ సమయంలో ఎయిర్ పోర్టులో ఓ ఫోటోగ్రాఫర్ ను దగ్గరకు పిలిచుకుని తారక్ మాట్లాడారు. ఇటీవల ఎన్టీఆర్ దుబాయ్ వెళ్తున్న సమయంలో ఆ ఫోటోగ్రాఫర్ అక్కడే ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆ తర్వాత దుబాయ్ లోనూ కనిపించినట్టున్నాడు. ఇక మళ్లీ వెంటనే హైదరాబాద్ ఎయిర్ పోర్టు వద్ద కనిపించడంతో తారక్ గుర్తుపట్టి దగ్గరకు పిలుచుకుని మాట్లాడారు.
తారక్: దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావ్ ?.
ఫోటోగ్రాఫర్: నిన్న సార్..
తారక్: అంతా ఓకేనా ?..
ఫోటోగ్రాఫర్ : అంతా ఓకే సర్..
ఫోటోగ్రాఫర్: అవార్డ్ వచ్చినందుకు కంగ్రాట్స్ సర్.
తారక్: థాంక్స్ అమ్మా ..
అంటూ ఫోటోగ్రాఫర్, తారక్ మధ్య సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దటీజ్ ఎన్టీఆర్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Young Tiger #jrntr with family back to Hyderabad post winning best actor award in #SIIMA2023inDubai@tarak9999 #southpaparazzi #tollywoodcelebs pic.twitter.com/s1WvkiMzms
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) September 18, 2023
ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.