Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాలిన అవసరం లేదు. తారక్ డైలాగ్ లకు, డ్యాన్స్ లకు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే అభిమానుల సందడి మాములుగా ఉండదు. కటౌట్లు , పూలాభిషేకాలు, పాలాభిషేకాలు ఆ హంగామానే వేరు. అదే తారక్ పుట్టిన రోజు అయితే అభిమానులకు అది పెద్ద పండగే.. యంగ్ టైగర్ పుట్టిన రోజును అభిమానులు భారీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సారి దేశంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేయవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు తారక్ . ఇటీవలే తారక్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. సోషల్ వేదికగా ఆయన అభిమానులకు తన విన్నపాన్ని తెలిపారు.
“నా అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తి గా కోలుకుని, కోవిడ్ ను జయిస్తాను అని ఆశిస్తున్నాను. ప్రతి ఏటా మీరు నా పుట్టిన రోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనం గా భావిస్తాను. కానీ ఈ సంవత్సరం మీరు ఇంటి పట్టునే ఉంటూ, లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ నియమాలను పాటిస్తూ జాగ్రత్త గా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక. ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు. మన దేశం కరోనా తో యుద్ధం చేస్తోంది. కనిపించని శత్రువు తో అలుపెరుగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు మరియు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మన సంఘీభావం తెలపాలి. ఎందరో తమ ప్రాణాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఆ కుటుంబాలకు కుదిరితే అండగా నిలబడాలి. మీ కుటుంబాన్ని జాగ్రత్త గా చూసుకోండి. మీరు జాగ్రత్త గా ఉండండి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, చేతనైన ఉపకారం చేయండి. త్వరలో మన దేశం ఈ కరోనా ను జయిస్తుంది అని నమ్ముతున్నాను. ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందాం. అప్పటి వరకు, మాస్క్ ధరించండి. జాగ్రత్త గా ఉండండి. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ మీ ఎన్టీఆర్” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చదవండి :