Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన పిల్లలతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు తారక్. అయితే ఈ ఫొటోలో తారక్ చేతికి గాయం అయినట్టు కనిపిస్తుంది. దాంతో అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. అసలు విషయం ఏంటంటే ఇటీవల తన ఇంటి జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ ఎన్టీఆర్ గాయపడ్డారు. వర్కౌట్స్ చేస్తుండగా ఎన్టీఆర్ కుడి చేతి వేలుకు గాయం అయ్యింది.
ఎన్టీఆర్ కుడి చేతి వేలుకు నాలుగు రోజుల క్రితం వైద్యులు మైనర్ సర్జరీ చేశారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తారక్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు యంగ్ టైగర్. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమా రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు తారక్ ఈ సినిమా షూటింగ్ మరో నెలరోజుల్లో ప్రారంభం కానుంది. సినిమాలతోపాటు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు తారక్. గతంలో బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా చేస్తున్నారు. తారక్ ఒక్కడే కాదు ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతికి కూడా సర్జరీ జరిగింది. కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్ అనే నరం మీద ఒత్తిడి పడటం నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించారు చిరు. చేతికి సర్జరీ జరిగిందని.. 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, ఒత్తిడి తగ్గించారని మెగాస్టార్ స్వయంగా పేర్కొన్నారు. ఆ వెంటనే నట సింహం బాలయ్య కూడా గాయపడ్డారు. కుడి చేతి భుజం నొప్పితో బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు… కేర్ ఆసుపత్రి వైద్యులు బాలకృష్ణకు సర్జరీ చేశారు. దాదాపు నాలుగు గంటలపాటు ఈ సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు తారక్ కూడా గాయపడటం తో ఇటు మెగా అభిమానులు అటు నందమూరి అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. ఇలా వరుసగా హీరోలు గాయబారినపడటం పై విశ్లేషకులు స్పందిస్తూ.. దర్శకులు ఇస్తున్న ఛాలెంజింగ్ రోల్స్ కోసం హీరోలు భారీగా కసరత్తులు చేస్తున్నారు. జిమ్‌లో గంటల తరబడి వర్కౌట్స్ చేస్తున్నారు ఈక్రమంలోనే ఇలా గాయాలబారిన పడుతున్నారని చెప్తున్నారు.
Ntr 1మరిన్ని ఇక్కడ చదవండి :