దేవర సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు కొరటాల. మ్యాన్ ఆఫ్ మాసెస్ దాదాపు ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా రానున్నాడు. దాంతో ఫ్యాన్స్ ఈ సినిమా ఎలా ఉంటుందా అని ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచిన మూవీ టీమ్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. అయితే తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసినా అభిమానులు భారీగా రావడంతో క్యాన్సిల్ అయ్యింది. తాజాగా ఎన్టీఆర్ మీద అభిమానంతో ఫ్యాన్స్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏకంగా రియల్ షార్క్ తో ట్రిబ్యూట్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఫ్లేక్సీ లు ఏర్పాటు చేసి సముద్రంలో ఓ వీడియో క్రియేట్ చేశారు.
సముద్రంలో రియల్ షార్క్‌ల మధ్య దీన్ని రికార్డు చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అంటే ఫ్యాన్స్ కు ఎంత ప్రేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ , వీడియోలు, సాంగ్స్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఎన్టీఆర్ స్వయంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
A Sea Sized Tribute To The KING OF RED SEA, Celebrating @tarak9999 🐯 Like Never Before
Overseas NTR Fans @dustysayz @kantri_munna09 @AbcTarak5 @Bebbuli4NTR
A @sr1k4r Edit 🎞️@DevaraMovie #DevaraOnSep27th#Devara #DevaraCelebrations pic.twitter.com/wlmTnAMS9f
— Venky (@PrimeRonaldoCR7) September 24, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.