RRR: ప్రస్తుతం సినిమా లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్(RRR). దాదాపు మూడేళ్ళుగా ఈ సినిమాగురించి నిత్యం మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) అల్లూరి సీతారామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR )కొమురం భీమ్ గా నటించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, స్టార్ హీరో అజయ్ దేవగణ్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ యూట్యూబ్లో దూసుకుపోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా చరిత్రలో ఎప్పటికీ కలవని ఇద్దరూ వీరుల మధ్య స్నేహాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రాజమౌళి తెరక్కించిన అద్భుత దృశ్యకావ్యాన్ని వెండితెరపై చూద్దామనుకున్న వారి ఆశలపై కరోనా నీళ్లను చల్లింది. దేశంలో కేసులు భారీగా పెరగడం, పలు రాష్ట్రాలు నిబంధనలు అమలు చేయడంతో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సినిమాను వాయిదా వేయలేక తప్పలేదు.
ఆర్ఆర్ ఆర్ సినిమాను మార్చి 18వ తేదీన గానీ, ఏప్రిల్ 28వ తేదీన గాని ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఇంట్రవెల్ బ్యాంగ్ అదిరిపోనుందట. ఇక్కడి నుంచే కథ అనూహ్యమైన మలుపు తిరుగుతుందని అంటున్నారు. ఇక సెకండ్ ఆఫ్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు ఉండనున్నాయట. క క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలైట్ గా ఉండనుందని తెలుస్తుంది. 40 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఈ ఇంట్రవెల్ ఫైట్ , క్లైమాక్స్ ఫైట్ కోసం, ఈ సినిమా బడ్జెట్ లో 30 శాతాన్ని ఖర్చు చేశారని అంటున్నారు. అంటే ఈ రెండు ఫైట్లు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు.
మరిన్ని ఇక్కడ చదవండి :