మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కాంబినేషన్లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో రామ్ చరణ్, పూజాహెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య సినిమాలో విలన్ పాత్రలో రియల్ హీరో సోనూసూద్ నటిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మరో పవర్ ఫుల్ విలన్ ఉన్నట్లుగా సమాచారం. అతడెవరో కాదు బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా. ఈ నటుడు ‘అశ్వథ్థామ’ సినిమాలో క్రైమ్ విలన్గా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నితిన్ భీష్మ సినిమాలో మెప్పించాడు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో కనిపించనున్నట్లుగా టాక్. ఈ సినిమా మే 13న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read:
గోపిచంద్ సినిమాలో ఆర్జీవి హీరోయిన్.. స్పెషల్ సాంగ్లో స్టెప్పులెయనున్న అప్సర రాణి..