Dunki Movie : డంకీ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

పఠాన్ సినిమా ఏకంగా 1000కోట్లు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలై హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన జవాన్ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.

Dunki Movie : డంకీ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ
Dunki Movie

Updated on: Dec 21, 2023 | 6:47 PM

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. పఠాన్ సినిమా ఏకంగా 1000కోట్లు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలై హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన జవాన్ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమా కూడా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.

ఇక రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ అందుకున్న షారుఖ్ ఇప్పుడు డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డంకీ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన డంకీ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. షారుఖ్ డంకీ సినిమా సినిమా పై మంచి టాక్ తో దూసుకుపోతుంది.

రాజ్ కుమార్ హిరానీ గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా మంచి టాక్ సొంతం చేసుకుంటుంది. డంకీ సినిమాకు మంచి ఓపినింగ్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కూడా వెయ్యి కోట్లు వసూల్ చేసేలానే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే డంకీ సినిమా ఓటీటీ డీల్ సెట్ అయ్యిందని తెలుస్తోంది. డంకీ సినిమాను జియో సినిమా భారీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. డంకీ సినిమాను జియో సినిమా రూ. 155 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. సినిమా కలెక్షన్స్ ను బట్టి, సినిమాకు వచ్చే రెస్పాన్స్ ను బట్టి డంకీ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.