
”శేషు మూవీ తరువాత డైరెక్టర్‌గా ఎందుకు గ్యాప్ ఇచ్చారని అందరూ అడుగుతున్నారు.. ఇప్పటికే నువ్వు చేసింది చాలమ్మా అని నా గురించి అనేవాళ్లూ ఉన్నారు… కానీ ఆడవాళ్లు తలచుకుంటే ఏమైనా చేయగలరని ప్రూవ్ చేస్తా.. ఎవరేం అనుకున్నా పర్లేదు..” అంటున్నారు జీవితా రాజశేఖర్.
జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో యాంగ్రీ మ్యాన్ “డా. రాజశేఖర్” యాంగ్రీ స్టార్‌గా తెరకెక్కుతున్న సినిమా “శేఖర్”. మే 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. హైదరాబాద్ AMB Cinemasలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మూవీ టీంతో పాటు “మేజర్” హీరో “అడివి శేష్”, హీరోయిన్ ఈషా రెబ్బా, డైరెక్టర్ పవన్ సాదినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ.. తన కెరీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
”పెళ్లికి ముందు మెహందీ లాంటి కార్యక్రమాలు ఉన్నట్టు, సినిమాకు ముందు ట్రైలర్, సాంగ్స్ అంటూ ఉంటాయి. మా సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకున్నాం.. కానీ, కోవిడ్ పరిస్థితుల వల్ల చాలా సినిమాలు ఆగిపోయాయి.. లాస్ట్ కి ఇప్పుడు మాకు అవకాశం దొరికింది. మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఈ సినిమా మీద..” అన్నారు రాజశేఖర్.
బైలైన్.. శ్రీహరి… (టీవీ 9 ఎంటర్టైన్మెంట్ డెస్క్)
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: KGF Chapter 2: బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 ఊచకోత.. ఆమీర్ ఖాన్ దంగల్ రికార్డ్ బ్రేక్..
Viral Video: నాటు నాటు పాటకు పెళ్లికూతురు అదిరిపోయే డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..