విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు ప్రకాష్ రాజ్. అలాగే జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ప్రకాష్ రాజ్ రాజకీయాల పైన కూడా షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. అలాగే మా ప్రెసిడెంట్ గాను పోటీ చేసి వార్తల్లో నిలిచారు ప్రకాష్ రాజ్. సినిమాలతో పాటు రాజకీయ పార్టీపైనా విమర్శలు గుప్పించి హాట్ టాపిక్ గా మారారు. అతని వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. ప్రకాష్ రాజ్ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. ప్రకాష్ రాజ్ మొదటి భార్య గురించి చాలా మందికి తెలియదు.
ప్రకాష్ రాజ్ మొదటి భార్య పేరు లలితా కుమారి. ఈ ఇద్దరూ 2009లో విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి సంవత్సరం, ప్రకాష్ కొరియోగ్రాఫర్ పోని వర్మను వివాహం చేసుకున్నాడు. దీనిపై తమిళ సెలబ్రిటీ జయంతి కన్నప్ప ఆసక్తికర కామెంట్స్ చేశారు. లలిత కుమారి తమిళ నటి డిస్కో శాంతికి చెల్లెలు. లలిత చెన్నైకి వచ్చే ఆర్టిస్టులకు ఉండేందుకు ఏర్పాట్లు చేసేవారు. ప్రకాష్ రాజ్ కర్ణాటక నుంచి అవకాశాల కోసం చెన్నై వచ్చారు. ఆయన ఉండడానికి లలిత సహాయం చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 1994లో లలిత, ప్రకాష్‌ల వివాహం జరిగింది.
పెళ్లి తర్వాత లలిత, ప్రకాష్ రాజ్ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దురదృష్టవశాత్తు 2004లో ప్రకాష్ రాజ్ కుమారుడు సిద్ధూ డాబాపై నుంచి పడి కన్నుమూశాడు. దీంతో లలిత, ప్రకాష్ రాజ్ దూరమయ్యారు. అదే సమయంలో ప్రకాష్ జీవితంలోకి ‘పోనీ వర్మ’ వచ్చిందని జయంతి వివరించారు. దాంతో ప్రకాష్ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికి లలిత అభ్యంతరం చెప్పలేదు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తాను అని చెప్పింది. విడాకుల తర్వాత కూడా పిల్లల బాధ్యతను ప్రకాష్ స్వయంగా తీసుకున్నాడు. పిల్లలను ప్రకాష్ విదేశాలకు పంపించాడని జయంతి కన్నప్ప తెలిపారు. పొన్ని, ప్రకాష్ 2010లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
Kanhaiya’s reply to Manoj Tiwari. pic.twitter.com/0BcV2CQfjs
— Narundar (@NarundarM) May 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.