
లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ మాస్టర్. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా కొన్ని రోజులు జైలు శిక్ష కూడా అనుభవించాడీ స్టార్ కొరియోగ్రాఫర్. అయితే బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ జానీ మాస్టర్ కు సినిమా ఛాన్స్ లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కొరియో గ్రాఫర్ చేతిలో పలువురు స్టార్ హీరోల ప్రాజెక్టులున్నాయి. కాగా గతంలో తన కొరియోగ్రఫీ ట్యాలెంట్ కు ప్రతీకగా ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నాడు జానీ మాస్టర్. నేషనల్ అవార్డుకు కూడా ఎంపికయ్యాడు. అయితే ఆ తర్వాత లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ కావడంతో నేషనల్ అవార్డు వెనక్కి వెళ్లిపోయింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్ గా మళ్లీ బిజీ అయిపోయాడీ డ్యాన్స్ మాస్టర్. ముఖ్యంగా జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ‘పెద్ది’లోని ‘చికిరిచికిరి’ సాంగ్ ఎంత సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో రెహమాన్ మ్యూజిక్ తో పాటు జానీ కంపోజ్ చేసిన స్టెప్ప్ కూడా హైలెట్ గా నిలిచాయి. ఇలా గతంలోలా మళ్లీ వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతోన్న జానీ మాస్టర్ ను తాజాగా ‘క్రియేటివ్ కొరియోగ్రాఫర్’ అవార్డు వరించింది. కర్ణాటకకు చెందిన చిత్తార మీడియా ఈ అవార్డును అందించింది. ఈ పురస్కారంతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన జానీ మాస్టర్ ఇలా రాసుకొచ్చాడు.
‘ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు చిత్తారా మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాకు ఇలా అవకాశాలు కల్పించిన నటీనటులకు, దర్శక నిర్మాతలకు అలాగే టెక్నీషియన్లు ప్రేక్షకులకు స్పెషల్ థ్యాంక్స్. వారి పూర్తి మద్దతును తెలియజేస్తున్నందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇలా మీరు అందిస్తున్న ఆదరాభిమానాలతో నేను భవిష్యత్తులో ఇంకా మంచి కొరియోగ్రఫీ అందిస్తానని మాటిస్తున్నాను’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు జానీ మాస్టర్.
ప్రస్తుతం జానీ మాస్టర్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు డ్యాన్స్ మాస్టర్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు మాత్రం జానీ మాస్టర్ పై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న అతనికి ఇలాంటి అవార్డులను ఎందుకు ఇస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Elated to receive the CREATIVE CHOREOGRAPHER Award for all the superhit chartbuster songs I did till date 😇 Thank you @Chittaramedia for the honour 🤝
I’m forever grateful to all the Actors, Directors, Technicians, Producers, and the Audience for their constant support,… pic.twitter.com/eZp8oveHnT
— Jani Master (@AlwaysJani) November 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.