Tirumala: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tirumala: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
Janhvi Kapoor - Janhvi Kapoor - Maheswari

Edited By:

Updated on: Jan 05, 2024 | 3:50 PM

నటి జాన్వీ కపూర్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి.. తీర్థప్రసాదాలు అందజేశారు. జాన్వీతో కలిసి ఆమె కజిన్, నటి మహేశ్వరి, జాన్వీ బాయ్ ఫ్రెండ్‌గా చెబుతున్న శిఖర్ పహారియా కూడా తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్నారు. దైవ దర్శనానికి వచ్చిన జాన్వీ..  బంగారం రంగు చీరను ధరించారు. శిఖర్ తెల్లటి ధోతీ-కుర్తాతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

జాన్వీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఈ ఫోటోలను పంచుకుంది.  “ఇప్పుడు 2024 ప్రారంభమైనట్లు అనిపిస్తుంది. గోవిందా.. గోవిందా” అని క్యాప్షన్ ఇచ్చింది. జాన్వీ, శిఖర్ తాము డేటింగ్ చేస్తున్న విషయాన్ని ఇప్పటివరకు కన్ఫామ్ చేయలేదు. అలాగని ఆ వార్తలను ఖండించలేదు. ఇద్దరూ చాలాసార్లు కలిసి కనిపించారు. శిఖర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. అతను బిజినెస్ రంగంలో ఉన్నాడు. పోలో ప్లేయర్ కూడా.

కాగా జాన్వి నటుడు రాజ్‌కుమార్ రావుతో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ మాహి’లో కనిపించనుంది. ‘రూహి’ లో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 19 న విడుదలవ్వనుంది. ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’తో దర్శకుడిగా పరిచయం అయిన శరణ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తెలుగులో తొలిసారి ఆమె ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమాలో నటిస్తుంది. ఈ మూవీని శివ కొరటాల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.