AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: జాన్వీ కపూర్ సోషల్ మీడియా ఖాతాలో అశ్లీల చిత్రాలు.. ఫ్యాన్స్ షాక్.. అసలు విషయం ఇదే..

తాజాగా ఆమె పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో ఉన్నట్లుండి అశ్లీల చిత్రాలు కనిపించాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. జాన్వీ ఖాతాలో ఇలాంటి ఫోటోస్ ఏంటీ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో వెంటనే జాన్వీ పర్సనల్ అలర్ట్ అవుతూ దీనిపై క్లారిటీ ఇచ్చింది. జాన్వీకి అసలు ఎక్స్ అకౌంట్ లేదని.. ఆమె పేరుతో ఉన్న ఫ్యాన్ అకౌంట్ ద్వారా ఫోటోస్ షేర్ అయినట్లు తెలిపారు.

Janhvi Kapoor: జాన్వీ కపూర్ సోషల్ మీడియా ఖాతాలో అశ్లీల చిత్రాలు.. ఫ్యాన్స్ షాక్.. అసలు విషయం ఇదే..
Janhvi Kapoor
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2024 | 7:01 AM

Share

ఇటీవల కొద్దిరోజులుగా సోషల్ మీడియా ప్రపంచంలో పలువురు సెలబ్రెటీస్ తరచూ ఫేక్ అకౌంట్స్ భారీన పడుతున్నారు. ఓవైపు డీప్ ఫేక్ వీడియోస్.. మరోవైపు నకిలీ ఖాతాలకు సినీతారలు టార్గెట్‌గా మారుతున్నారు. ఇటీవలే రష్మిక, అలియా భట్ డీప్ ఫేక్ బాధితులు కాగా.. ఇప్పుడు హీరోయిన్ జాన్వీ కపూర్ కు మరో సమస్య వచ్చింది. నెట్టింట జాన్వీ చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇన్ స్టాలో నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. అయితే తాజాగా ఆమె పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో ఉన్నట్లుండి అశ్లీల చిత్రాలు కనిపించాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. జాన్వీ ఖాతాలో ఇలాంటి ఫోటోస్ ఏంటీ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో వెంటనే జాన్వీ పర్సనల్ అలర్ట్ అవుతూ దీనిపై క్లారిటీ ఇచ్చింది. జాన్వీకి అసలు ఎక్స్ అకౌంట్ లేదని.. ఆమె పేరుతో ఉన్న ఫ్యాన్ అకౌంట్ ద్వారా ఫోటోస్ షేర్ అయినట్లు తెలిపారు.

దీంతో జాన్వీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాన్వీ కపూర్ ప్రతినిధి సూచించారు. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ఎవరీ పేరుతోనైనా ఖాతాలను సృష్టంచడం చాలా సులభమని.. జాన్వీ కపూర్ కు ఎక్స్ లో ఎలాంటి అధికారిక ఖాతా లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్ అకౌంట్స్ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని.. అలాగే అలాంటి నకిలీ ఖాతాల జోలికి వెళ్లొద్దని కోరారు.

ఇదిలా ఉంటే జాన్వీ చివరిగా మిస్టర్ అండ్ మిసెస్ మహిలో కనిపించింది. ఇందులో నటుడు రాజ్‌కుమార్ రావు కూడా నటించారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ డాక్టర్ మహిమగా నటించింది. ఆమె భర్త మహేంద్ర కోసం క్రికెటర్‌గా మారుతుంది. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ వచ్చింది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంలో నటిస్తుంది. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో నటించనుంది. అలాగే వరుణ్ ధావన్ సరసన తులసి కుమారి చిత్రంలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి