AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్ 10లోకి పాపులర్ స్టార్ కమెడియన్స్.. ఈసారి ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పక్కా.. ప్లాన్ మాములుగా లేదుగా..

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది. అయితే ఈ సారి హౌజ్‌లోకి స్టార్ కమెడియన్స్ రాబోతున్నారట. ఇందుకు సంబంధించిన సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సీరియల్ నటీనటులతోపాటు జబర్దస్త్ కమెడియన్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసుకుందామా.

Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్ 10లోకి పాపులర్ స్టార్ కమెడియన్స్.. ఈసారి ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పక్కా.. ప్లాన్ మాములుగా లేదుగా..
Bigg Boss Telugu 10
Rajitha Chanti
|

Updated on: Aug 29, 2026 | 8:45 PM

Share

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ల్యాండ్‌మార్క్ సీజన్ సెప్టెంబర్ 6 నుండి ప్రారంభం కానునట్లు తెలుస్తోంది. ఈసారి షోలో వినోదం పదిరెట్లు ఉండేలా నిర్వాహకులు బిగ్ ప్లాన్ చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు, డ్రామా, టాస్కులతో పాటు ప్రేక్షకులు ఎక్కువగా ఆశించేది వినోదం. అయితే షో ప్రారంభంలోనే టీఆర్‌పీ రేటింగ్స్‌ను పెంచేందుకు గాను పలువురు పాపులర్ స్టార్ కమెడియన్లను హౌస్‌లోకి తీసుకురావడానికి కింగ్ నాగార్జున, నిర్వాహకులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

ప్రచారంలో ఉన్న టాక్ ప్రకారం, ‘జబర్దస్త్’ ఫేమ్ ఆటో రామ్ ప్రసాద్ , నరేష్ ఈ సీజన్‌లో కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇటీవల విడుదలైన టీవీ షోల ప్రోమోలలో వీరిద్దరూ కనిపించకపోవడం, షూటింగ్‌లకు తాత్కాలికంగా దూరంగా ఉండటంతో వీరి ఎంట్రీ దాదాపు ఖాయమైనట్లేనని ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన టీవీ షోల ప్రోమోలలో వీరిద్దరూ కనిపించకపోవడం, షూటింగ్‌లకు తాత్కాలికంగా దూరంగా ఉండటంతో వీరి ఎంట్రీ దాదాపు ఖాయమైనట్లేనని ప్రచారం జరుగుతోంది.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

వీరితో పాటు టెంపర్ వంశీ, కృష్ణుడు, రామ్ ప్రసాద్, వర్షిణి సౌందరాజన్ వంటి ప్రముఖుల పేర్లు కూడా కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి. గత సీజన్లలో ముక్కు అవినాష్, రోహిణి, ఇమ్మాన్యుయేల్, ఫైమా వంటి కమెడియన్లు హౌస్‌లో తమదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను విశేషంగా అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే ఫార్ములాను మరింత విస్తరిస్తూ, ల్యాండ్‌మార్క్ 10వ సీజన్‌ను ‘ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్’ అనే థీమ్‌తో ముస్తాబు చేస్తున్నారు. సామాన్యులకు అవకాశం కల్పించే ‘అగ్ని పరీక్ష’ కాన్సెప్ట్ , స్టార్ సెలబ్రిటీల కాంబినేషన్‌తో ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో వినోదానికి కొదవ ఉండదని బుల్లితెర వర్గాలు భావిస్తున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

Follow Us