Manchu Lakshmi: జబర్దస్త్ రాకింగ్ రాకేష్‌ కూతురికి నామకరణం చేసిన మంచు లక్ష్మి.. ఏం పేరు పెట్టిందో తెలుసా?

|

Oct 26, 2024 | 6:37 PM

జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన అతను ఇప్పుడు హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Manchu Lakshmi: జబర్దస్త్ రాకింగ్ రాకేష్‌ కూతురికి నామకరణం చేసిన మంచు లక్ష్మి.. ఏం పేరు పెట్టిందో తెలుసా?
Jabardasth Rakesh, Manchu Lakshmi
Follow us on

జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాతలు ఇటీవలే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. రాకేష్ సతీమణి సుజాత పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు జబర్దస్త్ కపుల్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆనందంలో ఉండగానే రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తోన్న సినిమా కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) విడుదలకు సిద్ధమైంది. దీంతో అటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ, ఇటు పర్సనల్ లైఫ్ లోనూ రాకింగ్ రాకేష్ వరుసగా శుభ శకునాలే ఎదురవుతున్నాయి. ఇక పండంటి మహాలక్ష్మి తమ ఇంట అడుగు పెట్టడంతో రాకేష్- జోర్దార్ సుజాతల ఆనందానికి అవధుల్లేవు. ఇటీవల జరిగిన కేసీఆర్ ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ లో తమ కూతురిని అందరికీ పరిచయం చేశారు జబర్దస్త్ కపుల్. తాజాగా ఓ టీవీ ప్రోగ్రామ్ కు తమ కూతురిని కూడా తీసుకొచ్చారు లవ్లీ కపుల్. ఇదే ప్రోగ్రామ్ కు మంచు లక్ష్మి, అనసూయ, శ్రీ ముఖి తదితర సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ కూతురికి మంచి పేరు పెట్టమని మంచు లక్ష్మిని అడిగారు రాకింగ్ రాకేష్ దంపతులు. దీంతో సుజాత బిడ్డను మురిపెంగా చేతుల్లోకి తీసుకున్న మంచు వారమ్మాయి ‘తారాశ్రీ’ అని పేరు పెట్టింది. ఆ తర్వాత తండ్రి రాకింగ్ రాకేష్ తన కూతురి చెవిలో మూడుసార్లు ఈ పేరు చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు రాకింగ్ రాకేష్ దంపతులకు మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత. ఇద్దరూ కలిసి స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇదే క్రమంలో ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్నారు. అనంతరం తమ ప్రేమ విషయాన్ని జబర్దస్త్ వేదికపైనే బయటపెట్టారు. ఆ తర్వాత ఇరు పెద్దల అనుమతిలో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. గతేడాది ఫిబ్రవరి 24న తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాతలు పెళ్లిపీటలెక్కారు. ఇప్పుడు వీరి వైవాహిక బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారీ లవ్లీ కపుల్. ప్రస్తుతం రాకింగ్ రాకేష్ కూతురి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కేసీఆర్ సినిమా ప్రమోషన్లలో జబర్దస్త్ రాకింగ్ రాకేష్.. వీడియో

కూతురితో ఇంట్లోకి అడుగు పెడుతోన్న జబర్దస్త్ కపుల్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.