నిన్న మొన్నటి వరకు కలిసి మెలిసి అందర్నీ నవ్వించిన జబర్దస్త్ ఫ్యామిలీ మెంబర్స్ .. నేడు తలో దారిలో నడుస్తున్నారు. జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేసి.. వారి వారి కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. రాజకీయాలతో.. సినిమాలతో.. నయా నయా షోలతో తెగ బిజీ అయిపోతున్నారు. అయితే వీరిలో కొంత మంది మాత్రం.. ఆ షోకు సంబంధించిన సీక్రెట్ విషయాలను తాజాగా బయటపెడుతున్నారు. తమకు నచ్చని కంటెస్టెంట్స్ గురించి తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అలా ఇటీవల జబర్దస్త్ షో గురించి ప్రొడ్యూసర్ మల్లెమాల శ్యాంప్రసాద్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు కిర్రాక్ ఆర్పీ. జబర్దస్త్ నుంచి బయటికి వచ్చి మరో షోలో కమెడియన్‌గా చేస్తున్న ఈయన.. స్టార్ కమెడిన్ సుడిగాలి సుధీర్ గురించి కూడా.. షాకింగ్ కామెంట్స్ చేసి నెట్టింట వైరల్ అయ్యారు. దాంతో పాటే.. జబర్దస్త్ జడ్జిలు నాగబాబు, రోజా రెమ్యూనరేషన్ గురించి కూడా షాకింగ్ విషయాన్ని చెప్పాడు. ఆ మాటలతో కూడా నెట్టింట విపరీతంగా బజ్‌చేస్తున్నారు.
అందరూ అనుకున్నట్టే.. జబర్దస్త్ జడ్జిలకు భారీ రెమ్యూనరేషన్ ఉంటుందని రివీల్ చేసిన కిర్రాక్ ఆర్పీ.. నాగబాబు కంటే.. రోజాకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారని చెప్పి అందర్నీ షాక్ చేశారు. జబర్దస్త్ షోకు వెన్నుదన్నుగా ఉన్న నాగబాబుకే మల్లెమాల వారు ద్రోహం చేసిందన్నట్లుగా మాట్లాడారు. అందరు ఆర్టిస్టులను మనస్పూర్తిగా ప్రోత్సహించే నాగబాబుకే తక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం తెలిసి తనకు భాదేసింది అన్నట్టుగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడాడు.
అయితే ఆర్పీ మాట్లాడిన ఈ మాటలపై కూడా రియాక్టయ్యారు జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు. కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ కు దూరమైనప్పటికీ.. షో మీదున్న ప్రేమతో.. శ్యాంప్రసాద్ పై ఉన్న గౌరవంతో.. కిర్రాక్ ఆర్పా విమర్శలకు క్లారిటీ ఇచ్చారు. కిర్రాక్ ఆర్పీ పెద్ద ఫ్రాడ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అన్నం పెట్టిన సంస్ద గురించి ఇష్టమొచ్చినట్టు తప్పుగా మాట్లాడడం.. ఏంటని ప్రశ్నించారు. అసలు జబర్దస్త్ లేకపోతే ఆర్పీ పరస్థితి ఏంటంటూ.. ఫైర్ అయ్యారు. పనిలో పనిగా నాగబాబు, రోజా రెమ్యూనరేషన్ పై కూడా క్లారిటీ ఇచ్చారు ఏడుకొండలు.
రోజా హీరోయిన్‌గా పాపులర్ అని.. ఆ తరువాత బుల్లి తెరపై సీరియల్స్ కూడా చేసి తన మార్కెట్ పెంచుకున్నారన్న ఏడుకొండలు.. రోజా తో కంపేర్ చేస్తే.. నాగబాబుకు అప్పట్లో అంత మార్కెట్ లేదన్నారు. ఆ కారణంతోనే.. నాగబాబు కంటే రోజాకే ఎక్కువ రెమ్యూనరేష్ ఇచ్చేవారని ఉన్న విషయాన్ని చెప్పారు. అంతేతప్ప ఆర్పీ చెప్పినట్టు.. చెప్పాలనుకున్నట్టు.. మరే కారణం లేదన్నారు ఏడుకొండ