
జబర్దస్త్ నుంచి నటుడిగా ఎదిగిన వారిలో మహేష్ ఒకడు. ఆతర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించాడు. ఇక రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు మహేష్ ఆచంట. సినిమాల్లో కమెడియన్‌గా, కీలక పాత్రల్లో నటిస్తూ.. మంచి యాక్టర్‌గా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు మహేష్. 2017లో దర్శకుడు సుకుమార్ రంగస్థలంలో అవకాశం ఇచ్చిన తర్వాత.. అతడి ఫేట్ మారిపోయింది. ఆ చిత్రంలో చిట్టిబాబు స్నేహితుడిగా నటించి.. విపరీతమైన గుర్తింపు పొందాడు. మహేష్ స్కిల్ అందరికీ తెలియడంతో వెనువెంటనే అవకాశాలు వచ్చాయి. శతమానం భవతి, మహానటి చిత్రాలతో నటుడిగా స్థిరపడిపోయాడు.
రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, నటుడు విశ్వక్ సేన్ వంటి వాళ్లు మహేష్‌ను బాగా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మంచి పారితోషకం అందుకుంటూ మంచి సినిమాలు చేస్తున్నాడు మహేష్. ఇదిలా ఉంటే మహేష్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియోలో ఎమోషనల్ గా మాట్లాడుతూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే..
మహేష్ ఆచంట మాట్లాడుతూ.. “లైఫ్ చాలా అన్‌ప్రెడిక్టబుల్.. ఎప్పుడు ఎవరి లైఫ్ లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మనం బయట చూసినదానిని బట్టి ఏవేవో ఊహించుకొని.. నమ్మేయటం కరెక్ట్ కాదు.. ముఖ్యంగా రిపోర్టర్స్‌కి, మీమర్స్‌కి.. నేను నిజం చెప్పే వరకు మీరు అనుకున్నది రాయొద్దు.. త్వరలో నేనే మీకు మొత్తం నిజం చెబుతాను అంటూ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే మహేష్ ఎందుకు ఇంత ఎమోషనల్ అయ్యాడు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఏమైంది అన్నా.? ఏమంత కష్టం వచ్చింది అన్నా.? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇది సినిమా ప్రమోషన్.? సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ ఈ వీడియో చేశాడని కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి