ఆ జబర్దస్త్ నటుడితో గొడవలు.? అతనికి ఫ్యాన్స్ ఉన్నారు.. నా ఫాన్స్ నాకు ఉన్నారన్న హైపర్ ఆది

జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటీ నటులు చాలా మంది ఉన్నారు. కొందరు కమెడియన్స్ గా, దర్శకుడిగా, హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. ఇక సినిమాల్లో కమెడియన్ గా రాణిస్తున్న వారిలో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ లో తన కామెడీతో టాప్ కమెడియన్ గా మారాడు. అలాగే సినిమాల్లోనూ తన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు హైపర్ ఆది.

ఆ జబర్దస్త్ నటుడితో గొడవలు.? అతనికి ఫ్యాన్స్ ఉన్నారు.. నా ఫాన్స్ నాకు ఉన్నారన్న హైపర్ ఆది
Hyper Aadi

Updated on: Jan 30, 2026 | 9:54 AM

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది ఒకడు. తన కామెడీతో ప్రేక్షుకులను విశేషంగా ఆకట్టుకున్నాడు హైపర్ ఆది. ఎన్నో వదల స్కిట్స్ లో నవ్వులు పూయించాడు హైపర్ ఆది. అలాగే సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకున్నాడు. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ రాణిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ ఇంటర్వ్యూలో హైపర్ ఆది, తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి పలు విషయాలను పంచుకున్నారు. సుడిగాలి సుధీర్‌తో తనకున్న స్నేహంపై, పెళ్లి గురించి మాట్లాడాడు హైపర్ ఆది. సుడిగాలి సుధీర్‌తో తనకు గొడవలు ఉన్నాయని సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్‌ను హైపర్ ఆది ఖండించాడు. ప్రేక్షకులు సుధీర్‌ను ఇలా అంటున్నావు, అలా అంటున్నావు అని తనను ప్రశ్నిస్తుంటారని తెలిపాడు.

అన్నం బదులు అందం తింటుందా..!! సీరియల్‌లో సైడ్ యాక్టర్.. కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు..

అయితే అలాంటిదేమీ లేదని, అతని ఫ్యాన్స్ అతనికి ఉంటారు.. నా ఫాన్స్ నాకు ఉన్నారు. తామిద్దరం ఆన్-సెట్‌లో మంచి స్నేహితులమని ఆది స్పష్టం చేశాడు. తమ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన స్కిట్‌లు ఎంత హిట్టయ్యాయో తమ ఇద్దరికీ తెలుసని, కొన్ని మిలియన్ల వ్యూయర్‌షిప్ సాధించాయని పేర్కొన్నాడు. కొంతమంది కావాలనే టార్గెట్ చేసి కామెంట్లు చేస్తారని, వాటిని తాను పట్టించుకోనని తెలిపాడు. సుధీర్ హీరోగా ఎదగడం పట్ల తనకెంతో సంతోషమని, తమ వాళ్ళందరూ విజయం సాధించాలని కోరుకుంటానని తెలిపాడు ఆది.

గోడకేసి కొట్టి, కటింగ్ ప్లేయర్‌తో మంగళసూత్రం తెంచాడు.. సింగర్ కౌసల్య జీవితంలో ఇంత విషాదమా..

డబల్ మీనింగ్ కామెడీపై వస్తున్న విమర్శలకు ఆది గట్టి కౌంటర్ ఇచ్చాడు. డబల్ మీనింగ్ జోకులను తానే సృష్టించానని కొందరు అంటున్నారని, కానీ అవి తాను రాకముందు నుంచే ఉన్నాయని తెలిపాడు ఆది. ఒక స్కిట్‌లో ఒకటి రెండు డబల్ మీనింగ్ జోకులు ఉండొచ్చని, అవి ప్రేక్షకులు అంగీకరించే విధంగానే ఉంటాయని ఆయన అన్నాడు. బాడీ షేమింగ్ కామెడీ గురించి మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ వంటి లెజెండరీ నటులు కూడా తమ మధ్య అండర్‌స్టాండింగ్‌తో ఒకరిపై ఒకరు పంచులేసేవారని గుర్తు చేశాడు ఆది. తమ స్కిట్లలో వేసే ప్రతి జోక్ ముందే టీమ్ సభ్యులందరికీ చెప్పి, వారి అంగీకారం పొందిన తర్వాతే స్టేజిపై చేస్తామని, ఆపై టెలికాస్ట్ వరకు వస్తాయని స్పష్టం చేశాడు.

ఇవి కూడా చదవండి

చూడటానికి పెద్ద అంకుల్.. కానీ నాతో అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..