Raamam Raaghavam: దర్శకుడిగా మారిన జబర్దస్త్ కమెడియన్.. ‘రామం రాఘవం’ ఫస్ట్ లుక్ రిలీజ్.. హీరో ఎవరంటే..

ఇప్పటికే జబర్ధస్త్ కమెడియన్ వేణి.. దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన 'బలగం' ఏ రేంజ్ హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. దిల్ రాజ్ బ్యానర్లో వచ్చిన ఈమూవీకి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో కమెడియన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అతడే ధనరాజ్. జబర్దస్త్ షోలో తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు ధనరాజ్. అలాగే పలు సినిమాలో సహయనటుడిగానూ కనిపించాడు. ఇప్పుడు డైరెక్షన్ చేసేందుకు రెడీ అయ్యాడు.

Raamam Raaghavam: దర్శకుడిగా మారిన జబర్దస్త్ కమెడియన్.. రామం రాఘవం ఫస్ట్ లుక్ రిలీజ్.. హీరో ఎవరంటే..
Dhanraj

Updated on: Jan 24, 2024 | 7:15 AM

బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది హాస్యనటులు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అప్పటివరకు పలు చిత్రాల్లో చిన్న పాత్రలలో కనిపించినా.. ఈ షోతో పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే వెండితెరపై కమెడియన్స్‏గా అలరించిన కొందరు.. దర్శకులుగా కొత్త ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే జబర్ధస్త్ కమెడియన్ వేణి.. దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ‘బలగం’ ఏ రేంజ్ హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. దిల్ రాజ్ బ్యానర్లో వచ్చిన ఈమూవీకి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో కమెడియన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అతడే ధనరాజ్. జబర్దస్త్ షోలో తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు ధనరాజ్. అలాగే పలు సినిమాలో సహయనటుడిగానూ కనిపించాడు. ఇప్పుడు డైరెక్షన్ చేసేందుకు రెడీ అయ్యాడు.

గతేడాది తాను దర్శకత్వం వహిస్తున్నా సినిమాను అనౌన్స్ చేశాడు ధనరాజ్. తాజాగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఈ మూవీకి రామం రాఘవం అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపారు. అలాగే ఇందులో సముద్రఖని, ధనరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరిద్దరు ఇందులో తండ్రికొడుకులుగా కనిపించనున్నారని సమాచారం. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ను సరికొత్తగా వెండితెరపై చూపించనున్నట్లు తెలుస్తోంది. విమానం సినిమా దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను అందించారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృథ్వి, శ్రీనివాస రెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.