Rithu Chowdary: రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి.. క్లారిటీ ఇచ్చిన భర్త

|

Jan 04, 2025 | 1:08 PM

యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన రీతూ చౌదరి ప్రారంభంలో పలు సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అయితే జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర టీవీషోల్లోనూ సందడి చేస్తోందీ అందాల తార. అందంతో పాటు కామెడీ టైమింగ్ తో కుర్రకారును కవ్వించే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Rithu Chowdary: రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి.. క్లారిటీ ఇచ్చిన భర్త
Rithu Chowdary
Follow us on

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయినా భామల్లో క్రేజీ బ్యూటీ రీతూ చౌదరి ఒకరు. ఈ చిన్నది తన కామెడీతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ అనుకోని చిక్కుల్లో ఇరుక్కుందని తెలుస్తుంది . ఏకంగా రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాం లో ఆమె అడ్డంగా బుక్‌ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరికి పేరు బయటకు వచ్చిందని టాక్ వినిపిస్తుంది. విజయవాడ, ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌లో ఆమె అడ్డంగా బుక్కయ్యారని అంటున్నారు.

రీతూ చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనదైన కామెడీతో మంచి పేరును సంపాదించుకుంది. అంతేకాదు అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్న రీతు చౌదరి కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. అయితే ప్రస్తుతం ఆమె ల్యాండ్‌ స్కామ్‌లో అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : దిమ్మతిరిగింది సామి..! ఈ టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్స్.. ప్రభాస్ ఫ్రెండ్ సిస్టర్సా..!!

ఆంధ్రప్రదేశ్, ఇబ్రహీంపట్నం కు చెందిన రూ.700 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి స్కామ్‌లో రీతూ చౌదరి పేరు కూడా బయటకు వచ్చింది. ఇందులో పలువురు పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్‌జగన్ సోదరుడు వైఎస్‌ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్‌పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీతు చౌదరి శ్రీకాంత్ కు రెండో భార్య.

ఇది కూడా చదవండి : Kanchana 4: దెయ్యంగా భయపెట్టనున్న హాట్ బ్యూటీ.. కాంచన 4లో ఆ క్రేజీ భామ

కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా రూ. 700 కోట్ల ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్లు సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. అయితే కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉందని అంటున్నారు. ఇక రీతూ చౌదరి అసలు పేరు వనం దివ్య. అసలు ఈ విషయంపై రీతూ అధికారికంగా రియాక్ట్ అయ్యే వరకు క్లారిటీ రావాల్సి ఉంది.. నిజా నిజాలు ఏంటో రీతూ చౌదరి ఎప్పుడు బయట పెడుతుంది అనే ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇదిలా ఉంటే రీతూ భర్త శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు అని అన్నారు. మొదటి నుంచి నా ఫ్యామిలీ టాక్స్ కరెక్ట్ గా పే చేస్తున్నాం.. రీతూ చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకు చెందినవి, మేము సంపాదించుకున్నవి అని అన్నారు. అలాగే నేను ఎవరికీ బినామీని కాదు. నాపై వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవం అని అన్నారు శ్రీకాంత్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి