Nabha Natesh: సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోన్న ఇస్మార్ట్ బ్యూటీ.. వైరల్ అవుతోన్న ఫొటోస్

|

Jul 19, 2022 | 2:47 PM

యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నభనటేష్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది

Nabha Natesh: సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోన్న ఇస్మార్ట్ బ్యూటీ.. వైరల్ అవుతోన్న ఫొటోస్
Nabha Natesh
Follow us on

యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నభనటేష్(Nabha Natesh). తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు సినిమాల కంటే ముందు ఈ అమ్మడు కన్నడలో సినిమాలు చేసింది. ఒకే ఏడాది మూడు సినిమాల్లో నటించి మెప్పించింది నభనటేష్. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. నన్ను దోచుకుందువటే సినిమా తర్వాత నభా డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసింది. రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది ఈ అమ్మడు.

ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అమ్మడుఆచితూచి అడుగులు వేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మాస్ రాజా రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో నటించింది నభనటేష్ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తరువాత సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా నభనటేష్ కు హిట్టు అందించలేక పోయింది. ఆ వెంటనే బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అల్లుడు అదుర్స్ అనే సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. రకరకాల ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తోంది. తాజాగా నభనటేష్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లాంగ్ ప్రాక్ లో అరాచకం సృష్టిస్తోంది నభనటేష్. ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. నాభ నటేష్ గ్లామరస్ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి